'భరత్ అనే నేను' సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తొలి సినిమాతోనే పిచ్చ పిచ్చగా క్రేజ్ సంపాదించేసింది. 'లస్ట్ స్టోరీస్' సినిమాతో హాట్ బ్యూటీగా పాపులర్ అయిపోయింది. పాపులారిటీ ఎలాంటిదైనా కానీ, అమ్మడికి ఫ్యాన్స్‌లో ఉన్న ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోతోందనే చెప్పాలి. తాజాగా ల్యాక్మీ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసిన కైరా అద్వానీ పిక్స్ చూస్తుంటే, ఫ్యాన్స్ శాంతం ఆమె అందానికి మంత్ర ముగ్ధులయిపోతున్నారు. ప్రకృతిలోని అందాలన్నీ అమాంతం అలా నడిచొస్తుంటే ఎంతందంగా ఉంటుంది. అసలు చూడతరమా ఆ దృశ్యాన్ని. ఎంతందమో, ఎంతద్భుతమో.. కదా. అలాగే ఉంది ఈ అందాల రాజహంస అలా నడిచొస్తుంటే. గోల్డెన్ కలర్ డిఫరెంట్ కాస్ట్యూమ్‌లో పింక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ స్లీవ్‌లెస్ టాప్‌లో కైరా అందాలు సందడి చేస్తున్నాయి. ఈ షోలో చాలా మంది ముద్దుగుమ్మలు హాట్ హాట్ క్యాట్ వాక్ చేశారు. కానీ వారందరిలో కైరా ది స్పెషల్ అన్నట్లుగా ఉంది.