మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. శీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు విభిన్న పాత్రల్లో రవితేజ నటిస్తున్నాడు. అందులో ఒకటి ముస్లిం పాత్రనీ తెలుస్తోంది.
మూడు పేక ముక్కలపై మూడు రకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో రవితేజ కనిపిస్తున్నాడు. గెటప్స్‌లో పెద్దగా వేరియేషన్స్ ఏమీ కనిపించట్లేదు కానీ, పాత్ర స్వభావాల్లోనే వేరియేషన్ ఉంటుందనిపిస్తోంది. శీనువైట్ల - రవితేజ కాంబినేషన్ అంటే అంచనాలు బాగా ఉంటాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'దుబాయ్ శీను', 'వెంకీ', 'నీ కోసం' చిత్రాలు రవితేజకు మంచి విజయం అందించాయి. ఆ తర్వాత శీనువైట్లకు కూడా సరైన హిట్ రాలేదు. చాలా గ్యాప్ తర్వాత కుదిరిన ఈ కాంబినేషన్ ఈ సారి హిట్ కొట్టాలనే నమ్మకంతోనే రంగంలోకి దిగింది.
రవితేజ బాడీ లాంగ్వేజ్ ఏంటో, రవితేజను అభిమానులు ఎలా కోరుకుంటారో శీను వైట్లకు బాగా తెలుసు. ఆ యాంగిల్‌లోనే ఈ సినిమాకి కథ ప్రిపేర్ చేశాడు. ఒక్క రవితేజతోనే హిట్ కొట్టిన శీను వైట్ల ఇప్పుడు ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. అన్నట్లు ఈ సినిమాతో గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. మరో ఇద్దరు హీరోయిన్స్‌కీ ఈ సినిమాలో చోటుంటుంది. అయితే ప్రస్తుతానికి ఇలియానా పేరు మాత్రమే వినిపిస్తోంది. మరో ఇద్దరు ముద్దుగుమ్మలెవరో తెలియాల్సి ఉంది.
తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌కి వస్తున్న రెస్పాన్స్ అయితే బాగుంది. చూడాలి ముందు ముందు మాస్ రాజా ఇవ్వబోయే సర్‌ప్రైజ్‌లు ఎలా ఉండబోతున్నాయో.!