తెలుగులో 'భరత్ అనే నేను' చిత్రంతో తెరంగేట్రం చేసి, తొలి సినిమాకే సెన్సేషనల్ విజయం అందుకున్న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ పేరు ఇప్పుడు తెగ పాపులరైపోతోంది. దీనికంతటికీ కారణం 'భరత్' తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో 'లస్ట్ స్టోరీస్' అనే బోల్డ్ కంటెన్ట్ వెబ్ సిరీస్‌లో నటించింది.
ఇటీవలే రిలీజైన ఈ వెబ్ సిరీస్‌లో కైరా అద్వానీతో పాటు మనీషా కోయిరాల, భూమి పెడ్నేకర్, నేహా ధూపియా, రాధికా ఆప్టే తదితరులు నటించారు. కానీ వారందరిలోనూ ఈ ముద్దుగుమ్మ నటనకే మంచి గుర్తింపు వచ్చింది. గుర్తింపుతో పాటు ఈ సినిమాలో కైరా నటించిన హాట్ సన్నివేశాలు ఒకింత వివాదాస్పదమయ్యాయి కూడా. అయినా స్టోరీకి ఆ మాత్రం స్పైసీ అవసరం పడిందన్నది ఆమె వాదన. ఈ సన్నివేశాల గురించి ఆమెనే స్వయంగా అడిగితే స్టన్నింగ్ ఆన్సర్స్ చెప్పేసింది.
సెక్స్ కోరికలు ఉండడం తప్పేం కాదు, కానీ వాటిని కంట్రోల్ చేసుకోలేకపోవడమే తప్పు అని ఈ ముద్దుగుమ్మ సెలవిచ్చింది. అయితే రియల్ లైఫ్‌లో ఆ విషయంలో తన సంగతేంటని అడిగితే, తనకంత టైం లేదనీ సింపుల్‌గా ఎస్కేప్ అయిపోయింది. భలే తెలివైన పిల్ల కదా.
ప్రస్తుతం ఈ బ్యూటీ చరణ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కి రెడీ అవుతోంది. చరణ్ - బోయపాటి శీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో ఈ ముద్దుగుమ్మే హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.