డబ్ స్మాష్ క్వీన్ అంటూ సోషల్ మీడియాలో దీప్తి సునైనా ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి బిగ్ బాస్ షోలో నాని కూడా చెప్పేశాడు. అట్లాంటి ఫాలోయింగ్ ఉన్న దీప్తి సునైనాకి ఇప్పుడు పోలిటికల్ సపోర్ట్ కూడా లభిస్తున్నట్టుగా సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే, దీప్తి సునైనా ని బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ నుండి తప్పించి ప్రతివారం ఆమెని ఇంటినుండి నిష్క్రమించకుండా ఆమెకి ఓటు చేయండి అంటూ ఫ్లేక్సిలు వెలిశాయి. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే- ఈ ఫ్లేక్సిలు ఇబ్రహీంపట్నం ఎమ్యెల్యే పేరున ప్రచురింపబడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆ ఫ్లేక్సిల పైన మన ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్డ దీప్తి సునైనా ని బిగ్ బాస్ హౌస్ లో విజేతగా నిలపడానికి దయచేసి అందరూ ఓటు వేయండి అని రాసి ఉంది.
దీనితో బిగ్ బాస్ హౌస్ కి పోలిటికల్ కలర్ వచ్చేసింది అంటే ఈ షో సామాన్య ప్రజానీకంలోకి ఎంతలా వెళ్ళిపోయిందో అర్ధంచేసుకోవచ్చు.