'లక్ష్మీబాంబ్‌'గా మారిన 'సీత'.!

మరిన్ని వార్తలు

'భరత్‌ అనే నేను' సినిమాలో క్లాస్‌గా కనిపించి మెప్పించింది. 'వినయ విధేయ రామ'లో ఇంకొంచెం ముందుకెళ్లి 'సీత' క్యారెక్టర్‌లో మాస్‌ ఆడియన్స్‌నీ కట్టి పడేసింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. బాలీవుడ్‌లో 'కబీర్‌సింగ్‌' గాళ్‌ ఫ్రెండ్‌గా షాహిద్‌ కపూర్‌తో రొమాన్స్‌కి సిద్ధమైంది.

 

ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌తో ఎట్‌ ఏ టైమ్‌ రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి 'గుడ్‌న్యూస్‌' కాగా, ఇంకోటి వెరీ లేటెస్ట్‌గా స్టార్ట్‌ అయిన 'కాంచన' రీమేక్‌ 'లక్ష్మీబాంబ్‌' చిత్రం. లారెన్స్‌ రాఘవ పోషించిన పాత్రను అక్షయ్‌ కుమార్‌ పోషిస్తున్నాడు. ఒరిజినల్‌ కాంచనలో నటించిన లక్ష్మీరాయ్‌ పాత్ర కైరా అద్వానీ పోషిస్తోంది. 'కాంచన'తోనే లక్ష్మీరాయ్‌ కెరీర్‌ టర్న్‌ అయ్యింది. మరి ఇప్పటికే క్రేజీయెస్ట్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కైరా 'లక్ష్మీబాంబ్‌'తో ఇంకెంత పవర్‌ చూపిస్తుందో చూడాలిక. ఒరిజినల్‌ తెరెక్కించిన లారెన్స్‌ రాఘవ ఈ సినిమాతో డైరెక్టర్‌గా బాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం కైరా అద్వానీ ఈ సెట్స్‌లోనే సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే, కైరా బాలీవుడ్‌లో బిజీ అవుతున్న వైనం చూస్తుంటే ఇక టాలీవుడ్‌లకి తిరిగి రాదేమో అనుకుంటున్నారంతా. కానీ త్వరలోనే ఓ స్టార్‌ హీరో సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెడతానని చెబుతోంది కైరా అద్వానీ. ఆ స్టార్‌ హీరో మహేష్‌ అని అంటున్నారు. మహేష్‌బాబు - అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా కన్నడ భామ రష్మికా మండన్నాని పరిశీలిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో కైరా అద్వానీ పేరు వచ్చి చేరింది. ఒకవేళ అన్నీ కుదిరి, మహేష్‌ కైరాకే ఓటేస్తే, రెండోసారి మహేష్‌తో ఈ భామ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నట్లవుతుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS