'హనీ' ఈజ్ ద బెస్ట్ అంటూ తనదైన శైలిలో అలరించి, సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది 'ఎఫ్ 2'తో ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్. ఈ సినిమా హిట్‌తో మెహ్రీన్ దశ తిరిగిపోయింది. వరుస ఆఫర్లు మెహ్రీన్‌ని వెతుక్కుంటూ వస్తున్నాయట. కానీ ఎందుకో మెహ్రీన్ కాస్త ఆచి తూచి వ్యవహరిస్తోందట.
గతంలో అలాగే తొందరపడి వచ్చిన ప్రతీ సినిమాకీ సైన్ చేసింది కానీ, సక్సెస్‌లు మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త కనుక అంత పరిణీతిగా అప్పుడు ఆలోచించలేదట. కానీ ఇప్పుడు పూర్తి పరిపక్వతతో ఆలోచించి, కథల విషయంలో పూర్తి జాగ్రత్తగా వ్యవహరిస్తోందట మెహ్రీన్. దాంతో అవకాశాలు వస్తున్నా, అన్నింటికీ సైన్ చేయడం లేదని చెబుతోంది. అయితే హీరోయిన్స్ అంటే దీపమున్నాకే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే నానుడి ఉంది. ఆ విషయం మెహ్రీన్ మర్చిపోయిందో ఏమో కానీ, ఆ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం మెహ్రీన్ హాట్ హాట్ ఫోటో సెషన్‌తో కాస్త బిజీగా గడుపుతోందట. చూస్తున్నారుగా ఈ పిక్‌లో మెహ్రీన్ అందచందాలు. నేవీ బ్లూ టాప్‌లో హాట్ క్లీవేజ్‌ని ఆరేస్తూ, ఆరెంజ్ కలర్ బోటమ్‌లో వయ్యారాలు పోతోంది.
మ్యాచింగ్ హై హీల్ డ్రస్సుకు హైలైట్‌గా నిలిచింది. ఇక మెహ్రీన్ ఇచ్చిన ఘాటు ఎక్స్‌ప్రెషన్‌కి కుర్రకారులో హీటు సెగలు పెళ్లుబుకుతున్నాయంటే నమ్మాలి మరి. అంతేగా.. అంతేగా..!