శంకర్ ఇటీవలే `అపరిచితుడు`ని హిందీలో రిమేక్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ సినిమాని హిందీలో ఎలా రీమేక్ చేస్తావంటూ.. `అపరిచితుడు` నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్... శంకర్ ని ఉద్దేశిస్తూ ఓ లేఖ రాశాడు. దానికి శంకర్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో `అపరిచితుడు` హిందీ రీమేక్ పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. శంకర్ ఎక్కడా తగ్గడం లేదు. `అపరిచితుడు` ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలెట్టేశాడు. అంతేకాదు... హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేసేసినట్టు తెలుస్తోంది.
ఇక్కడ విక్రమ్ పోషించిన పాత్రని... బాలీవుడ్ లో రణవీర్ సింగ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కథానాయిక కూడా సెట్టయ్యింది. సదా స్థానంలో.. బాలీవుడ్ లో. కిరాయా అడ్వాణీ నటించబోతోంది. ఇప్పటికే కిరాయాతో సంప్రదింపులు జరిపినట్టు టాక్. శంకర్ - రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. ఇందులోనూ కథానాయికగా కియారా పేరే పరిశీలనలో ఉందట. అంటే.. బ్యాక్ టూ బ్యాక్.. శంకర్ సినిమాల్లో ఛాన్సు కొట్టేసిందన్నమాట.