కియారా టాలీవుడ్‌ రీ ఎంట్రీ తప్పదా?

మరిన్ని వార్తలు

జూనియర్‌ హీరోలే కాదు, సీనియర్‌ హీరోలు కూడా ఫుల్‌ ఛార్జ్‌తో యాక్టివేట్‌ అయిపోతున్నారు ప్రస్తుతం టాలీవుడ్‌లో. మెగాస్టార్‌ చిరంజీవి 152వ సినిమాతో బిజీగా ఉండగా, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కూడా వెరీ లేటెస్ట్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేశారు. వస్తూ వస్తూనే ఏకంగా ఐదు ప్రాజెక్టులు ఓకే చేసి పెట్టేశారు. ఇక నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌, మహేష్‌, రవితేజ తదితర సీనియర్‌ హీరోలు ఆల్రెడీ ఛార్జ్‌లోనే ఉన్నారు. మరి వీరి సరసన నటించబోయే ముద్దుగుమ్మలే లేరిక్కడ. ప్రస్తుతం పూజా హెగ్దే, రష్మికా మండన్నా, నభా నటేష్‌, రాశీఖన్నా వంటి భామలు తప్ప టాలీవుడ్‌లో పెద్దగా క్రేజున్న భామలు కనిపించడం లేదు.

 

వీరిలోనూ రష్మిక, పూజాకే ఓ రేంజ్‌ సీను కనిపిస్తోంది. మరి, ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న మన సీనియర్‌ హీరోల సరసన రొమాన్స్‌ చేయబోయే ముద్దుగుమ్మల అంశమే, దర్శక - నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఓ మోస్తరు స్టార్‌డమ్‌ ఉన్న ముద్దుగుమ్మలైనా ఇండస్ట్రీకి చాలా అవసరం. ఆ క్రమంలో, 'భరత్‌' బ్యూటీ ఎక్కువగా గుర్తుకొస్తోందట మన మేకర్స్‌కి. ఈ ముద్దుగుమ్మ ఒడ్డూ పొడవు అన్నీ సీనియర్‌ హీరోల పక్కన చక్కగా సరిపోతాయి. అందుకే ఈ భామని మళ్లీ టాలీవుడ్‌కి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారట. అయితే, బాలీవుడ్‌లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న కైరా అద్వానీని టాలీవుడ్‌కి తీసుకురావడం సాధ్యమయ్యే పనేనా.? చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS