మెరూన్ వెల్వెట్ జాకెట్, క్రీమ్ కలర్ లాంగ్ లెహెంగాలో కియారా అచ్చు పెళ్లి కూతురులా లేదూ! అవును నిజమే ఈ డ్రస్ ఎవరికి వేసినా అలాగే అనిపిస్తారు. కానీ, కియారా మాత్రం పెళ్లి కోసం ఈ డ్రస్ ధరించలేదులెండి. ఓ మ్యాగజైన్ ఫోటో షూట్‌కి సంబంధించి ఇలా ట్రెడిషనల్ వేర్లో దర్శనమిచ్చింది కియారా అద్వానీ. ప్రస్తుతం ఆమె కెరీర్ బాలీవుడ్లో ఫుల్ స్వింగ్ ఉంది. ఈ తరుణంలో వెడ్డింగ్ బెల్స్ మాటే లేదు.
కానీ, ఇలాంటి బ్రైట్ అండ్ ఎట్రాక్టివ్ ఫోటో షూట్స్ మాత్రం చాలా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కియారా నుండి. ఇటీవలే 'కబీర్‌సింగ్' హిట్‌తో బాలీవుడ్లో కియారా అద్వానీ పేరు మార్మోగిపోతోంది. బోలెడన్ని ప్రాజెక్టులు ఇప్పటికే సైన్ చేసేసి ఉంది కియారా. వరుసగా ఒక్కొక్కటిగా ఆ ప్రాజెక్టులు ధియేటర్స్‌లో సందడి చేయనున్నాయి. అందాకా సోషల్ మీడియాలో ఇలాంటి స్పెషల్ ట్రీట్స్ చూసి పండగ చేస్కోవడమే. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ ఇట్.!