బిగ్‌బాస్‌ నుండి జాఫర్‌ని గెంటేస్తున్నారట!

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో సెకండ్‌ ఎలిమినేషన్‌కి రంగం సిద్ధమైంది. మొదటి వారం హేమని గెంటేశారు. కావాలనే హేమని బిగ్‌ హౌస్‌ నుండి తప్పించారనే టాక్‌ ఎలాగూ ఉంది. ఆమె ప్లేస్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ట్రాన్స్‌జెండర్‌ తమన్నాని ఎంటర్‌ చేసేందుకే హేమని బయటికి పంపించారనే ప్రచారం జోరుగా సాగింది. అయినా, హేమ ఎలిమినేషన్‌కి ముందే ఈ విషయం లీక్‌ అయిపోయింది. ఇప్పుడు సెకండ్‌ ఎలిమినేషన్‌ లీకేజీ కూడా వైరల్‌ అయ్యింది.

 

ఈ సారి జాఫర్‌ని బయటికి నెట్టేయనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ముందుగా ప్లాన్‌ చేసుకున్నట్లుగానే ఈ ఎలిమినేషన్స్‌ జరుగుతున్నాయనేది ఇంకోవైపు వాదన. రియాల్టీ షో అనే పేరు కేవలం టైటిల్‌లోనే కానీ, అంతా ప్రీ ప్లాన్డ్‌గానే షో నడుస్తోందనేది బయట ప్రచారం జరుగుతోంది. మొదట్లో జాఫర్‌ ఎలాగైనా బయటికి వచ్చేయాలనుకున్నాడు. కానీ, తర్వాత అడ్జస్ట్‌ అయిపోయాడు.

 

తనదైన శైలిలో హౌస్‌లో ఎంటర్‌టైన్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు. ఇలాంటి తరుణంలో ఆయన్ని బయటికి గెంటేయడం వెనక బిగ్‌బాస్‌ ఆంతర్యమేంటో కానీ, ఈ వారం కూడా మొదటి వారంలాగే ఖచ్చితంగా ఏదో సర్‌ప్రైజ్‌ ఉందనే టాక్‌ కూడా తాజా లీక్‌లో బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి, జాఫర్‌ అవుట్‌ అయితే, మరి హౌస్‌లోకి ఇంకెవరైనా కొత్తగా ఇన్‌ అవుతారా.? లేక మరేదైనా గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఉందా.? అనేది వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS