కిచ్చాసుదీప్ `ప‌హిల్వాన్‌' గ్రాండ్ రిలీజ్!

మరిన్ని వార్తలు

`ఈగ` ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `ప‌హిల్వాన్‌`. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు.

kicha sudeep pailwan aka pahilwan telugu movie

ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగులోనూ `ప‌హిల్వాన్‌` అనే పేరుతో ఆగ‌స్ట్ 29న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

kicha sudeep pailwan aka pahilwan telugu movie

రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన `ప‌హిల్వాన్` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. అలాగే ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో కూడా విడుద‌లైంది. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

kicha sudeep pailwan aka pahilwan telugu movie

`కె.జి.య‌ఫ్‌` చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసి ఘ‌న విజ‌యాన్ని అందుకున్న వారాహి చ‌ల‌న చిత్రం ఇప్పుడు `ప‌హిల్వాన్‌` చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

kicha sudeep pailwan aka pahilwan telugu movie


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS