ప్రేమ ముసుగుల్ని వరుసగా తొలగిస్తున్న హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

'ముసుగు వేయొద్దు మనసు మీదా.. వలలు వేయొద్దు వయసు మీదా.. ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుఫాను వేగాలతో..' అంటూ 'ఖడ్గం' సినిమాలో హాట్‌ హాట్‌ స్టెప్పులేసిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా. పేరు కిమ్‌ శర్మ. అమ్మడు చేసినవి తక్కువ సినిమాలే కానీ, రియల్‌ లైఫ్‌లో బోయ్‌ ఫ్రెండ్స్‌ని మాత్రం దప దపాలుగా మార్చేయడంలో తుఫాను వేగమే చూపించేసిందనాలి.

 

తొలుత కెన్యాకు చెందిన అలీ కుంజానీని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కెన్యా చెక్కేసింది. ఆ తర్వాత అతనితో విడిపోయి బాలీవుడ్‌లో పాగా వేసింది. అక్కడ అర్జున్‌ ఖన్నాతో డేటింగ్‌ అంటూ కొన్నాళ్లు లైఫ్‌ లీడ్‌ చేసింది. ఏమైందో ఏమో కానీ, ఆయనకీ హ్యాండిచ్చింది. ఈ మధ్య అసలు సిసలు తెలుగు కుర్రోడు హర్షవర్ధన్‌ రానాతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది. హర్ధవర్ధన్‌ అంటే 'బ్రదర్‌ ఆప్‌ బొమ్మాళీ' సినిమాలో కార్తీకకు జోడీగా, అల్లరి నరేష్‌కి బావగా నటించాడు. 'బెంగాల్‌ టైగర్‌', 'ఫిదా' తదితర సినిమాల్లోనూ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇంపార్టెంట్‌ రోల్స్‌ పోషించాడు. ఇంకేముంది ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే ప్రచారం కూడా జరిగింది అప్పట్లో. అయితే హర్షవర్దన్‌కీ గుడ్‌బై చెప్పేసిందట తాజాగా కిమ్‌ శర్మ. ఈ మధ్య వీరిద్దరికీ ఓ పెద్ద గొడవైందట. ఆ గొడవ కారణంగా ఇద్దరూ లవ్‌కి బ్రేకప్‌ చెప్పేయాలనుకున్నారట.

 

మేమిద్దరం ప్రేమలో ఉన్నామోచ్‌ అని ఒకప్పుడు చెప్పుకున్నట్లే, మేమిద్దరం విడిపోతున్నామోచ్‌ అంటూ తాజాగా అనౌన్స్‌ చేసేశారు. మరి కిమ్‌ శర్మ నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరో కానీ, ప్రస్తుతానికి ఇవే సంగతులు. చిత్తగించగలరు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS