మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కి ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే జపాన్‌లో వీరాభిమానులున్నారు. తాజాగా జపాన్‌లోని కొందరు అభిమానులు రామ్‌చరణ్‌కి కొన్ని లెటర్సూ, గ్రీటింగు కార్డులు పంపించారు. ఆ గ్రీటింగ్ కార్డుల్లో కొందరు అభిమానులు రామ్‌చరణ్ ముఖాన్ని స్కెచ్‌లా ఆర్డ్ చేసి పంపించారు. ఈ అభిమానాన్ని చూసి రామ్‌చరణ్ చాలా సంతోషంగా ఫీలయ్యారు. జపనీయులు తనపై అభిమానానికి గుర్తుగా పంపిన గ్రీటింగ్ కార్డులూ, లెటర్సూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు.
గత కొంత కాలంగా ఇండియన్ సినిమా ఖండాలు దాటి విజయం సాధిస్తోంది. రామ్‌చరణ్ నటించిన 'మగధీర' సినిమా జపాన్‌లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'బాహుబలి' సినిమాలు కూడా ఖండాలు దాటి దేశ విదేశాల్లో ఘన విజయం సాధించాయి. అలా ఈ సినిమాల్లో నటించిన రామ్‌చరణ్, ప్రబాస్, రానాలతో పాటు, రాజమౌళికీ అక్కడ ప్రత్యేక అభిమానులు ఏర్పడ్డారు.
ఇక తాజాగా రామ్‌చరణ్‌కి జపాన్ అభిమానులు ఇచ్చిన స్వీట్ సర్‌ప్రైజ్‌కి చరణ్ కూడా ఓ స్వీట్ రిప్లై ఇవ్వబోతున్నాడట. త్వరలో రామ్‌చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాని జపాన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అదే విషయాన్ని ఫ్యాన్స్‌కి సోషల్ మీడియా ద్వారా చరణ్ రివీల్ చేశాడు. 'నాపై ఇంత అభిమానం చూపిన జపాన్ ఫ్యాన్స్‌కి స్వీట్ న్యూస్.. త్వరలో మిమ్మల్ని కలవబోతున్నాను..' అంటూ ట్వీట్ చేశాడు రామ్‌చరణ్.