గ్లామ్‌షాట్‌: స్పైసీ అందాల 'ముసుగు' సుందరిని చూశారా?

మరిన్ని వార్తలు

'ముసుగు వేయొద్దు మనసు మీదా.. వలలు వేయొద్దు వయసు మీదా..' అంటూ 'ఖడ్గం' సినిమాలో వీర లెవల్లో అందాలారబోసిన ముద్దుగుమ్మ కిమ్‌ శర్మ గుర్తుంది కదా. 'మగధీర' సినిమాలో శ్రీహరికి జోడీగా ఓ స్పెషల్‌ సాంగ్‌లో నర్తించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. కానీ, బాలీవుడ్‌లో ఒకటీ అరా సినిమాల్లో నటించింది. అయితే, మన టాలీవుడ్‌ యువ నటుడితో, పీకల్లోతు ప్రేమలో ఉందంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి.

పలు ఫంక్షన్స్‌లో, పార్టీల్లో ఆ యంగ్‌ యాక్టర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగడంతో, ఆ వార్తలకు బలం చేకూరింది కూడా. ఆ సంగతి అటుంచితే, తాజాగా నెట్టింట్లో కిమ్‌ శర్మ ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. ఘాటు అందాల ప్రదర్శన అది. టూ పీస్‌ బికినీలో కనిపించి షాకిచ్చింది. బ్లూ, పింక్‌, ఆరెంజ్‌ అండ్‌ బ్లాక్‌ కాంబినేషన్‌లో ఉన్న ఈ టూ పీస్‌ బికినీలోంచి ఘాటుగా అందాల వడ్డన జరిగిపోతోంది. స్విమ్మింగ్‌ పూల్‌లో నిలబడి, హార్ట్‌ ఫుల్‌గా స్మైల్‌ ఇస్తూ జోష్‌గా ఫోటోకి పోజిచ్చింది. కళ్లకు గాగుల్స్‌ పెట్టుకుంది. కానీ, ఆమె అందాలను వదిలి మరే ఇతర యాక్సెసరీ పైనా, ఆబ్జెక్ట్‌ పైనా మనసు మళ్లదు మరి. ఆ రేంజ్‌లో ఆమె అందాల విందు ఉంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#tbt

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS