మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రానున్న మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కి 'SSMB 29' అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే అడ్వంచర్ మూవీ అని జక్కన్న ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఎన్నో ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ మూవీలో మహేశ్ తో పాటు కింగ్ నాగార్జున కూడా నటించనున్నారని టాక్.
రాజ మౌళి మూవీ అంటే వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని, స్టార్ క్యాస్ట్ ఉండేలా చూసుకుంటున్నాడు జక్కన్న. నాగ్ కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. 90 లోనే బాలీవుడ్ లో క్రేజీ హీరోగా గుర్తింపు పొందారు నాగ్. మొదటి పాన్ ఇండియా హీరో నాగార్జునే అనటంలో సందేహం లేదు. రీసెంట్ గా 'బ్రహ్మాస్త్ర' మూవీ కూడా చేసాడు. అందుకే నేషనల్ వైడ్ గా పాపులారిటీ ఉన్న మన్మధుడిని SSMB 29 లోకి తీసుకోవాలని జక్కన్న అనుకుంటున్నారట.
మహేశ్ బాబు - నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరికను 'ది ఘోస్ట్' ట్రైలర్ లాంచ్ టైంలో బయటపెట్టారు. ''29 ఏళ్ల కిందట మీ నాన్న కృష్ణ గారితో కలిసి నటించాను. ఇప్పుడు మనం కలిసి ఓ సినిమా ఎందుకు చేయకూడదు?’’ అని నాగార్జున ట్వీట్ చేయగా, "ఆ సమయం రావాలని ఆశిద్దాం" అని మహేష్ సమాధానమిచ్చారు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చినట్లు, రాజమౌళి వీరి కోరికను, తీర్చనున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ఈ న్యూస్ విన్న అక్కినేని - ఘట్టమనేని ఫ్యాన్స్ మంచి ఖుషీగా ఉన్నారు. నాగేశ్వరావు, కృష్ణ కలయికలో సూపర్ హిట్స్ ఉన్నాయి. కృష్ణ, నాగార్జున కూడా కలిసి నటించారు. ఇప్పుడు మహేష్, నాగార్జున కలిసి నటించే అరుదైన అవకాశం రానుంది.