దిల్ రుబా మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

చిత్రం: దిల్ రుబా
దర్శకత్వం: విశ్వ కరుణ్
కథ - రచన: విశ్వ కరుణ్


నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, నరైన్, జాన్ విజయ్, ఖ్యాతి డేవిసన్ తదితరులు.   


నిర్మాతలు: విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ


సంగీతం: శామ్ సీఎస్ 
సినిమాటోగ్రఫీ: డానియేల్ విశ్వాస్
ఎడిటర్: ప్రవీణ్.కేఎల్ 


బ్యానర్: శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ, ఏ యూడ్లీ ఫిలిం
విడుదల తేదీ: 14 మార్చ్ 2025
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.25/5
ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

 

టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది 'క' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే జోష్ తో వెంటనే 'దిల్ రుబా' లాంటి కమర్షియల్ సినిమాకి కమిట్ అయ్యి. 5 నెలల గ్యాప్ తో  ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం సినిమా అంటే కంటెంట్ ఉంటుంది అని ప్రేక్షకులు నమ్మేలా చేసాడు. ఇంతవరకు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు లేకుండా పక్కఇంటి కుర్రాడిలా నటించిన కిరణ్ ఇప్పుడు దిల్ రుబాతో యాక్షన్ హీరోగా మారాడు. ఈ మూవీ కిరణ్ కి హిట్ అందించిందో లేదో, సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.  


కథ:
సిద్ధార్థ రెడ్డి (కిరణ్ అబ్బవరం) తండ్రి, మ్యాగీ(నజియా డేవిసన్) తండ్రి ప్రాణస్నేహితులు. వీరిద్దరి స్నేహంతో పాటు సిద్దు మ్యాగీ ప్రేమ కూడా పెరిగి పెద్దదవుతుంది. కానీ కొన్ని  కారణాలు వలన మ్యాగీ   సిద్దార్థ్ కి బ్రేకప్ చెప్పి అమెరికా వెళ్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో అమ్మాయిలు అంటేనే విరక్తి, అసహ్యం పెంచుకుంటాడు సిద్దార్థ్. తరవాత తండ్రి మరణిస్తాడు. ఊరు మారితే బాగుటుంది అని సిద్దు తల్లి మంగుళూరు కాలేజ్ లో జాయిన్ చేస్తుంది. సిద్దు థాంక్స్, సారీ అనే పదాలు జీవితంలో అసలు వాడకూడదు అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతాడు.  పూర్తి వైరాగ్యంలో ఉన్న సిద్ధార్థ జీవితంలోకి అదే కాలేజ్ లో చదివే  అంజలి(రుక్సార్) ప్రవేశిస్తుంది. మొదట అంజలి పై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు సిద్ధుకి. కానీ అంజలి సిద్ధు వెంటపడి ప్రేమలో పడేలా చేస్తుంది. షరా మామూలే ఇద్దరు ప్రేమలో పడతారు. ఇద్దరు ఒకటే కాలేజ్. అదే కాలేజ్ లో విక్కీ (క్రాంతి కిల్లి) చేసిన ఒక గొడవ కారణంగా అంజలి, సిద్ధార్థ విడిపోతారు. ఈ లోగా సిద్దూ ఫస్ట్ ప్రేయసి మ్యాగీ రియలైజ్ అయ్యి సిద్ధుని, అంజలిని కలిపేందుకు అమెరికా నుంచి వస్తుంది. అసలు మ్యాగీకి సిద్దు ప్రేమ విషయం ఎలా తెలిసింది? మ్యాగీ కి అంజలికి ఉన్న సంబంధం ఏంటి? మ్యాగీ ఇండియా వచ్చి సిద్దు ప్రేమని గెలిపించిందా? వీరి ప్రేమ కథలో లోకల్ డాన్ జోకర్(జాన్ విజయ్) ఎందుకు ఎంటర్ అయ్యాడు? డాన్ కారణంగా సిద్దు , అంజలి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


విశ్లేషణ: 
స్టోరీ పెద్దగా లేకపోయినా హీరో క్యారెక్టరైజేషన్ హైలైట్ చేస్తూ తీసిన సినిమా 'దిల్‌రూబా'. థాంక్స్, సారీ లాంటి పదాలు హీరో నోటి వెంట రాకపోవటానికి ఓ రీజన్ ఉంది. హీరోకంటూ ఉన్న  ఒక క్యారెక్టరైజేషన్, దాని చుట్టూ అల్లిన కథలో బలం లేదు. ఓ అమ్మాయితో బ్రేకప్ తర్వాత అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకున్న అబ్బాయి జీవితంలోకి మరో అమ్మాయి రావడం ఇదివరకు చాల సినిమాల్లో చూసాం. ఇదేం కొత్త విషయం కాదు. 'దిల్‌రూబా' కథ రొటీన్ అయినా మంచి మంచి సీన్లు ఉన్నాయ్. హీరో హీరోయిన్స్ పరిచయం, ప్రేమలో పడటం అన్ని సీన్లు యూత్ కి బాగా కనక్ట్ అవుతాయి. కాకపోతే ఒక లవ్ స్టోరీ లో ఇన్ని ఫైట్స్ పెట్టడం కొంచెం డిస్టబెన్స్ గా ఉంటుంది.  


సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే కథ ఏమిటో అర్థం అయిపోతుంది. రొటీన్ లవ్ స్టోరీ తండ్రి మరణం, ప్రియురాలి బ్రేకప్  ఇవన్నీ హీరోని మూర్ఖంగా తయారు చేస్తాయి. ఇంకో అమ్మాయి మళ్ళీ తన జీవితంలోకి వచ్చినా గతం వెంటాడుతూ ఉంటుంది. ఇలా సినిమా మొత్తం హీరో క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. దాదాపు అర్జున్ రెడ్డి మూవీలో హీరో పాత్రని తలపిస్తుంది. హీరో క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేసినా ప్రజంటేషన్ లో తడబడ్డాడు దర్శకుడు. పూర్తిగా హీరో క్యారక్టర్ పై ద్రుష్టి పెట్టి కథని నెగ్లెక్ట్ చేసాడు. దిల్ రుబా లో కొన్ని సీన్స్ ఇది వరకు సినిమాల్లోవి అయినా వాటిని పూర్తి భిన్నంగా రాసుకున్నాడు. సత్యా ట్రాక్ బాగానే వర్కౌట్ అయింది. ఫస్ట్ ఆఫ్ మొత్తం ప్రేక్షకుడి ఊహకు అందేలా ఉంటుంది. హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేయటానికి పూరీ జగన్నాథ్ పాడ్ క్యాస్ట్ వింటున్నట్టు చూపిస్తారు. కథ లేకుండా కేవలం హీరో క్యారక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తూ చెప్పటంలో దర్శకుడు తడబడ్డాడు. 


నటీ నటులు:
'క' సినిమా డిఫరెంట్ మ్యానరిజం చూపించిన కిరణ్ అబ్బవరం దిల్ రుబా లో కూడా    డిఫరెంట్ క్యారెక్టర్ చేసాడు. ఈ మూవీలో కాలేజీ స్టూడెంట్ గా స్టైల్ గా కనిపించాడు. యాక్షన్ సీన్స్‌లోనూ స్టైలిష్ కొరియోగ్రఫీతో కిరణ్ మెరిశాడు. రుక్సార్ థిల్లాన్ పాత్రకి పెద్ద స్కోప్ లేదు. కానీ కాలేజ్ ఏజ్ అమ్మాయిలా బాగా నప్పింది. ఖ్యాతి డేవిసన్ పాత్ర పరిధి మేరకు నటించారు.  జాన్ విజయ్ విలనిజం రొటీన్ గా ఉంది. కమెడియన్ సత్యని ఈ మూవీలో పెద్దగా వాడుకొన్నది  లేదు. సత్య అంటే ఈ మధ్య సినిమాల్లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అలాంటి   సత్యాన్ని ఇంకొంచెం వాడుకుంటే కామెడీ బాగుండేది. విక్కీ పాత్రలో కిల్లి క్రాంతి చక్కగా నటించాడు. హీరో  తల్లిగా తులసి, రుక్సార్ తండ్రిగా 'ఆడుకాలం' నరేన్, వడ్లమాని శ్రీనివాస్, సమీర్, వాసు ఇంటూరి, 'గెటప్' శ్రీను తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.  


టెక్నికల్:
టెక్నికల్ టీం విషయానికి వస్తే శ్యామ్ సిఎస్ పాటలు, యాక్షన్ సీన్లలో ఆర్ఆర్ బావున్నాయి.  బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలెట్ అయ్యింది. ఫైట్స్ కంపోజిషన్ కూడా ఆకట్టుకుంది.  సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజివల్స్ సూపర్ గా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం శ్రద్ద పెడితే బాగుండేది.  హీరో స్టైలింగ్ నుంచి ప్రొడక్షన్ డిజైన్, కెమెరా వర్క్, మ్యూజిక్ అన్నీ విభాగాల్లో ప్రతి ఒక్క టెక్నీషియన్ సినిమాకి న్యాయం చేశారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తోంది. 


ప్లస్ పాయింట్స్ 
కిరణ్ అబ్బవరం 
టెక్నికల్ టీమ్ 
   

మైనస్ పాయింట్స్ 
కథ 
ఎమోషన్స్ 
నిడివి 


ఫైనల్ వర్దిక్ట్: దిల్ లేని రూబా 'దిల్ రుబా'..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS