నానీ.! కిరీటిని ఎందుకిలా అన్నావ్‌.!

మరిన్ని వార్తలు

బుల్లితెర మెగా రియాల్టీ షో బిగ్‌బాస్‌ మూడో ఎలిమినేషన్‌లో భాగంగా సెలబ్రిటీ కిరీటిని ఎలిమినేట్‌ చేయడం జరిగింది. ఇది కొంత మంది ఊహించిందే. అయితే గణేష్‌ ఎలిమినేట్‌ అవుతాడని కొందరు అంచనా వేశారు. కొంతమంది కాదు, ఎక్కువ మంది అభిప్రాయం అదే. అయితే ఈక్వేషన్స్‌ మారిపోయాయి. కిరీటి 'కార్నర్‌' అయ్యాడు. 

'కార్నర్‌' అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, హోస్ట్‌ నానితో హౌస్‌మేట్స్‌ అందరూ కిరీటిని బ్లేమ్‌ చేశారు. దానికి కారణం కౌషల్‌తో గొడవే. చిన్న మిస్‌ అండర్‌స్టాండింగ్‌ అది. నిజానికి అందులో తప్పు కిరీటిది కానే కాదు. అమ్మాయిల తరపున మాట్లాడాలనుకోవడమే కిరీటి చేసిన పొరపాటు. వారి కోసం కిరీటి మాట్లాడితే, మహిళలెవరూ అతనికి సపోర్ట్‌ చేయలేదు. వాస్తవాన్ని ఒప్పుకునేందుకు సాహసించలేదు. పైగా హోస్ట్‌ నాని కూడా 'ఇదా మగతనం' అని కిరీటిని కామెంట్‌ చేసి, కిరీటి ఆత్మ విశ్వాసం దెబ్బ తీశాడు. హోస్ట్‌గా నాని చేసిన బిగ్గెస్ట్‌ మిస్టేక్‌ ఇది. ఆ మిస్టేక్‌కి కిరీటి బలైపోయాడు. ఎ

లిమినేషన్‌ సందర్భంగా కిరీటి పెద్దగా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం రాలేదు. కిరీటి మంచితనం ఏంటో అందరూ చెప్పారు. అతని తప్పేం లేదని తేల్చేశారు. ఆ విషయం నాని కూడా ఒకప్పుకున్నాడు. అయితే ఎలిమినేషన్‌ రోజు నాని టీవీలో కిరీటి మీద వేసిన ఏవీ, అందులో నాని మగతనం డైలాగ్‌ కిరీటిని ఇంకా వేధించి ఉంటుంది. 

హ్యాపీగా బయటికి రావాలి.. అని ఆకాంక్షించిన నాని హోస్ట్‌గా ఆ ఏవీలో అది లేకుండా చేసి ఉంటే, కిరీటికి హుందాతనం, బిగ్‌బాస్‌ హుందాతనం, నాని హుందాతనం నిలబడి ఉండేది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS