ఈ వారం ప్రేక్షకుల ముందుకి సుమారు 11 చిత్రాలు వచ్చినప్పటికి అందులో రెండు చిత్రాలు మినహా పెద్దగా ఏవి ఆడియన్స్ ని ధియేటర్ కి రప్పించలేకపోయాయి. ఇక ప్రేక్షకులని అంతగా ఆకర్షించిన ఆ రెండు చిత్రాలు ఏంటంటే- తెలుగులో వచ్చిన ఈ నగరానికి ఏమైంది & హిందీలో వచ్చిన సంజు.
ముందుగా ఈ నగరానికి ఏమైంది గురించి మాట్లాడుకుంటే- పెళ్ళి చూపులు వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా తరువాత తరుణ్ భాస్కర్ నుండి వచ్చిన సినిమా ఇది. ముఖ్యంగా అంత హిట్ సినిమా తీసిన తరుణ్ మళ్ళీ ఏం తీసాడు అన్న ఆసక్తే ఈ సినిమా వైపుకి ప్రేక్షకులని మలచగలిగింది.
ఇక కథ విషయానికి వస్తే, నలుగురు స్నేహితులు వాళ్ళ షార్ట్ ఫిలిం అంతే... ఇంత తేలికైన కథకి సహజమైన కథనం, నవ్వించే సంభాషణలు రాసి మరోసారి ధియేటర్ కి వచ్చిన ప్రేక్షకుల మనసులని గెలుచుకున్నాడు. ఈ తరాహా చిత్రాలు తెలుగులో ఇప్పటివరకు రాలేదు అనే చెప్పాలి. తరుణ్ సినిమాలలో అందరిని ముఖ్యంగా ఆకర్షించేవి సంభాషణలే, ఎందుకంటే అవి ఏదో కాల్పనికంగా రాసినట్టు ఉండకుండా చాలా సహజంగా ఉండటమే...
ఏదేమైనా... రెండవ సినిమాలో కూడా నలుగురు కోత్తవాలని పెట్టి వారితో హిట్ కొట్టి మరోసారి తానెందుకు ప్రత్యేకమో అని నిరూపించాడు.
ఈ వారం ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్న మరో చిత్రం సంజు. ఈమధ్య కాలంలో బయోపిక్స్ చాలానే వస్తున్నప్పటికీ ఈ బయోపిక్ కొంచెం భిన్నం అనే చెప్పాలి. కారణమేంటి అంటే- ప్రస్తుతం మనమధ్య జీవిస్తున్న ప్రముఖ హీరో సంజయ్ దత్ జీవితం పైన ఆధారం తీసుకుని తీయడం ఒకటైతే మరొకటి ఆయన జీవితంలో చాలా కోణాలు ఉండటమే.
ముంబై పేళ్ళుళ్ళ కేసులో ఆయన పైన అభియోగాలు రావడం, ఆయనని టెర్రరిస్ట్ అంటూ ఒక ముద్ర వేయడం చివరికి ఆయన అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడు అన్న కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకి వచ్చాడు. ఇటువంటి అనేక కారణాలు ఆయన జీవితం పైన అందరి దృష్టిని మరల్చగలిగింది.
ఇక ఈ చిత్రాన్ని దేశంలోనే అత్యంత సమర్ధుడైన దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహించగా ప్రముక నటుడు రన్బీర్ కపూర్ తెర పైన సంజయ్ పాత్రలో మెరిసాడు. సినిమా చూస్తున్నంత సేపు కూడా మనం రన్బీర్ కపూర్ నటనకి ఫిదా అవ్వాల్సిందే, ముఖ్యంగా రన్బీర్ కపూర్-పరేష్ రావల్ నటన మనకి కన్నీళ్లు తెప్పిస్తాయి. ఈ సినిమా చూసాక కచ్చితంగా సంజయ్ దత్ పైన ఒక జాలీ మాత్రం కలుగుతుంది. అసలు దర్శక-నిర్మాతలు సామాన్య ప్రజానీకానికి అలాంటి ఒక ఫీలింగ్ కలిగించడానికి ఈ చిత్రం తీశారా అన్న ప్రశ్న కూడా మనకి ఎదురవుతుంది.
అయితే ఈ సినిమా మాత్రం రాజ్ కుమార్ హిరాణి గత చిత్రాలని దాటిపోయేదానిలా మాత్రం లేదు. కాకపోతే ఒక మంచి చిత్రంగా మాత్రం నిలిచిపోతుంది.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.