బిగ్ బాస్ సీజన్ 2 గెలిచేది ఎవరంటే

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 అప్పుడే మూడవ వారం సగంలోకి వచ్చేసింది, ఇంటి నుండి ముగ్గురు సభ్యులు ఇప్పటికే నిష్క్రమించగా ఇప్పుడు ఉన్న సభ్యులు తమ ప్రవర్తన, ఆట తీరుతో ప్రేక్షకుల దృష్టిని తమవైపుకి తిప్పుగోగలుగుతున్నారు.

ఇక మూడవ వారం ఇంటి నుండి నిష్క్రమించిన కిరీటి ప్రస్తుతం వివిధ స్టూడియో ఛానల్స్ లో తన బిగ్ బాస్ హౌస్ అనుభవాలని, అక్కడ తనకి ఎదురైనా తీపి & చేదు సంఘటనల గురించి వివరిస్తున్నాడు. ఇందులో భాగంగానే తన బిగ్ బాస్ హౌస్ అనుభవం నుండి ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారు అన్న ప్రశ్నకి- రోల్ రైడా కాని అమిత్ కాని గెలవొచ్చు అని తన మనసులోని మాట బయటపెట్టాడు.

ఇప్పుడు ఇంటి సభ్యులని పరిశీలించినా కూడా మనకి కిరీటి చెప్పిన ఆ ఇద్దరికీ ఈ సీజన్ విజేత అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు మనకి అనిపిస్తాయి. ఇదే క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో తనకి కౌశల్ కి మధ్య జరిగిన ఘర్షణ గురించి కూడా వివరణ ఇచ్చాడు. 

అయితే ఇంటిలో జరుగుతున్నది వేరే బయట ప్రేక్షకులకి అర్ధమవుతున్నది వేరే అని చెప్పాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS