హిందూ దేవతల మీద ఆవాకులు, చవాకులు పేలడం అందరికీ అలవాటైపోయింది. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకురావాలి. లేకపోతే ప్రజలు చట్టాల్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఏర్పడుతుంది. ఒకరి మతాన్ని ఇంకొకరు గౌరవించడం భారతదేశంలో మతాల మధ్య గొప్పతనం. ఆ గొప్పతనాన్ని చెడగొట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు అని నాగబాబు అన్నారు.
కత్తి మహేష్ పేరును ప్రస్థావించడానిక కూడా నాగబాబు ఇష్టపడలేదు. ఆ పేరు తలవాలంటేనే అసహ్యంగా ఉంది అని నాగబాబు అన్నారు. రాముడు సీతను వదిలేశాడు అన్న అంశాన్ని పట్టుకుని, కత్తి మహేష్, రామున్ని దగుల్బాజీ అన్నాడు. ఈ నేపథ్యంలో అతనిపై కేసులు నమోదయ్యాయి.
ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని లేకపోతే పరిణామాలు చేతులు దాటే అవకాశం ఏర్పడుతుంది అని నాగబాబు పరోక్షంగా హెచ్చరించడం గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ పైన గతంలో కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు కారణంగానే ఇప్పుడు నాగబాబు ఇలా స్పందించడానికి కారణం అని అంటున్న వారు లేకపోలేదు.
ఇక ఈ అంశంలో కత్తి మహేష్ పై పోరాడే వారికి తన పూర్తి మద్దతు ఉంటుంది అని చెప్పడం కొసమెరుపు.