కిషోర్ తిరుమలకి మెగా ఆఫర్?!

మరిన్ని వార్తలు

నేను శైలజా తో హిట్ కొట్టి ఇప్పుడు ఉన్నదీ ఒకటే జిందగీ చిత్రంతో సూపర్ హిట్ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఈ చిత్ర రీజల్ట్ తో అయనకి ఒక మెగా ఆఫర్ రానున్నది అన్న వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, కిశోర్ తిరుమల ఈ చిత్రానికి ముందు హీరో వెంకటేష్ తో ఒక చిత్రాన్ని మొదలుపెట్టారు, దానికి సంబందించిన ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

అయితే ఏవో కారణాల వల్ల సదరు చిత్రం ముందుకి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ కథకే మార్పులు చేసి హీరో రామ్ చరణ్ కి వినిపించే పనిలో ఉన్నాడట. ఇక ఉన్నది ఒకటే జిందగీ చిత్రం సక్సెస్ అయితే ఇక త్వరలోనే కిషోర్ తిరుమల-రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక చిత్రాన్ని మనం చూస్తాము.

మనం కూడా కిషోర్ కి సక్సెస్ రావాలని కోరుకుందాం...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS