శివ లాంటి ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమాని అందించిన నాగ్-ఆర్జీవీ కాంబో ఇప్పుడు మళ్ళీ కలవబోతున్నది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే వీరు ఇన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్ళీ చేయనున్న చిత్రం కావడంతో ఆ కథ ఎలా ఉండబోతున్నది అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో నాగార్జున ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడనున్నాడట.
ఆర్జీవీ చెప్పిన ఈ పాయింట్ నచ్చడంతోనే నాగ్ ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి ఇన్నేళ్ళ తరువాత వీరిరువురి కలయికలో రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతవరకు అలరించానుందో చూడాలి.
ఈ చిత్ర షూటింగ్ రాము త్వరలో తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ పూర్తయ్యాక మొదలవనుందట.