'బిగ్‌బాస్‌' హౌస్‌మేట్స్‌కి సంపూ ఆహ్వానమిదే.!

By iQlikMovies - September 18, 2018 - 17:26 PM IST

మరిన్ని వార్తలు

గత ఏడాది బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో వన్‌ ఆఫ్‌ ది హౌస్‌ మేట్‌ అయిన బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు ఈ శుక్రవారం తన తోటి హౌస్‌మేట్స్‌ అందరినీ ఒకే వేదికపై కలవబోతున్నారు. ఆయన నటించిన 'కొబ్బరిమట్ట' చిత్రం సాంగ్‌ ప్రోమో రిలీజ్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు. 

ఈ వేడుకకే బిగ్‌బాస్‌ సీజన్‌ 1 హౌస్‌మేట్స్‌ని సాదరంగా ఆహ్వానిస్తున్నాడు సంపూర్ణేష్‌బాబు. 'గతేడాది అందరం కలిసి ఒకే ఇంట్లో ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచుకున్నాం. మళ్లీ ఇప్పుడు మమ్మల్ని మేం కలుసుకుంటూ, మిమ్మల్ని కూడా ఒకే వేదికపై కలిసేందుకు ఇదే మా ఆహ్వానం..' అంటూ ట్విట్టర్‌లో ఓ ఇన్విటేషన్‌ పంపించారు బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు. ఆ ఆహ్వాన పత్రికపై లాస్ట్‌ సీజన్‌ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ 15 మంది ఫోటోలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఈ వేడుక జరగనుంది. సాయి రాజేష్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 

ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది ఈ సినిమా. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా సాంగ్‌ ప్రోమో రిలీజ్‌ ఫంక్షన్‌ని ఘనంగా ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS