గత శుక్రవారంనాడు మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యకి సంబంధించిన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
ఈ కిరాతక చర్య గురించిన చర్చ అందరిలోనూ నడుస్తున్న నేపధ్యంలో పలువురు ప్రముఖులు కూడా ఈ చర్యని తీవ్రంగా నిరసిస్తున్నారు. అందులో భాగంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ అంశం పై తన మనసులోని భావాలని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ప్రణయి హత్య కేసులో న్యాయం జరగాలి అంటూ ఈ క్రింద పోస్టు పెట్టాడు.
ఇక ఈ హత్య ఎలా జరిగింది? ఎవరెవరు చేశారు? అన్న వివరాలతో పోలీసులు కొద్దిసేపటిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు.