బన్నీ - అట్లీ కాంబోలో కోలీవుడ్ స్టార్ హీరో?

మరిన్ని వార్తలు

'పుష్ప 2' మూవీ తరువాత అల్లు అర్జున్ స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. దింతో బన్నీకి కూడా బాధ్యత పెరిగింది. తన ఫాన్స్ ని దృష్టిలో పెట్టుకుని పుష్ప తో వచ్చిన క్రేజ్ ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పుష్ప 2 తరవాత త్రివిక్రమ్ మూవీ కాదని అట్లీ తో ప్రాజెక్ట్ ఓకే చేసాడు. అట్లీ కూడా జవాన్ తో వచ్చిన పాపులారిటీ ని నిలబెట్టుకునే దిశగా శ్రద్ద పెట్టాడని తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు ఎవరితో కమిట్ అవకుండా బన్నీ కోసం మంచి కథ రాసాడని సమాచారం.

500 కోట్ల పెట్టుబడితో 1800 కోట్ల వసూళ్లు తెచ్చిన బన్నీ కోసం మేకర్స్ కూడా తగ్గేదేలే అంటున్నారట. సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ రెడీగా ఉన్నారట. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది అని టాక్. ఈ మూవీలో ఇంకో కీలక పాత్ర కూడా ఉందని లేటెస్ట్ అప్డేట్. ఆ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరోని రంగంలోకి తీసుకోనున్నారట.  రీసెంట్ గా అమరన్ తో హిట్ కొట్టి, ప్రస్తుతం 'పరశక్తి' చిత్రంతో బిజీగా ఉన్న శివ కార్తికేయన్ ని బన్నీ అట్లీ కాంబోలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా సినిమా కావటంతో అన్ని భాషల వాళ్ళని భాగం చేస్తున్నారట. కోలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న శివ కార్తికేయన్ ఇమేజ్ ఈ మూవీకి ప్లస్ అవుతుంది అని మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో శివకార్తికేయన్ రోల్ చాలా బలంగా డిజైన్ చేసినట్లు సమాచారం. బన్నీ- శివకార్తికేయన్ లాంటి ఇద్దరు డిఫరెంట్ స్టైల్ యాక్టర్స్ ఈ భారీ యాక్షన్ మూవీలో కనిపించనున్నారని తెలియటంతో ఫాన్స్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు. ముందు ముందు అట్లీ ఇంకెన్ని సర్ప్రయిజ్ లు ప్లాన్ చేస్తాడో అని బన్నీ ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS