బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి తెలుగు రచయితలపై గురి ఎక్కువ. గతంలోనూ తెలుగు రచయితలు అందించిన పలు స్టోరీలను బాలీవుడ్‌కి తీసుకెళ్లి మంచి విజయం సాధించాడు. రికార్డు స్థాయిలో విజయం సాధించిన 'భజరంగీ భాయిజాన్' చిత్రానికి కథనందించింది అక్షరాలా మన తెలుగు రచయిత విజయేంద్రప్రసాదే.
తాజాగా మరో తెలుగు రచయితకు బాలీవుడ్‌లో స్థానం కల్పిస్తున్నాడు మనోడు. ఆయన ఇంకెవరో కాదు, ప్రముఖ స్టోరీ రైటర్ కోన వెంకట్. ఈయన స్టోరీతో సల్మాన్‌ఖాన్ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడనీ బాలీవుడ్ వర్గాల సమాచారమ్. గతంలో రామ్, జెనీలియా జంటగా తెరకెక్కిన 'రెడీ' చిత్రాన్ని సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో రీమేక్ చేశాడు. ఈ సినిమాకి తెలుగులో కథ రాసింది కోన వెంకటే. ఈ సినిమాని సేమ్ టైటిల్‌తో సల్మాన్ బాలీవుడ్ రీమేక్ చేశారు. ఇదే కాదు 'కిక్' తదితర తెలుగు చిత్రాలకూ బాలీవుడ్ రీమేక్‌లో సల్మాన్ ఖాన్ నటించారు.
అలా టాలీవుడ్ రైటర్స్ అంటే సల్మాన్ ఖాన్‌కీ కొంచెం అభిమానం ఎక్కువే. కోన వెంకట్ స్క్రిప్ట్‌కి సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఈ సినిమాకి 'షేర్‌ఖాన్' అనే టైటిల్ అనుకుంటున్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుందట. ఈ రోజు సల్మాన్‌ఖాన్ నటించిన 'టైగర్ జిందాహై' ప్రేక్షకుల ముందుకొచ్చింది. కత్రినా కైఫ్ ఈ సినిమాలో చాలా కాలం తర్వాత సల్మాన్‌తో జత కట్టింది. భారీ అంచనాలతో ఈ సినిమా విడుదలైంది. మిక్స్‌డ్ టాక్ సంపాందించుకుంటోంది.
సల్మాన్, కత్రినా యాక్షన్ ఘట్టాలకు ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇవికాక సల్మాన్ 'కిక్ - 3', 'డ్యాన్సింగ్ డాడ్' 'భారత్' తదితర చిత్రాల్లో నటిస్తున్నాడు.