బెంగుళూరులో సన్నీనైట్ పేరుతో జరగాల్సిన న్యూ ఇయర్ ఈవెంట్‌కి అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించడం వివాదాస్పదమైంది. బాలీవుడ్ భామ సన్నీలియోన్ ఆ ఈవెంట్‌లో డాన్సులు చేయాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకల్లో ఈ ఈవెంటే హైలైట్ అవుతుందని అంతా అనుకున్నారు.
అయితే అనూహ్యంగా ఈ ఈవెంట్‌కి సన్నీ హాజరు కావడంపై వివాదాలు తలెత్తడం, ఈవెంట్ నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించడం ఫాస్ట్ ఫాస్ట్‌గా జరిగిపోయాయి. దాంతో షో నిర్వహణ ఇప్పుడు గందరగోళంలో పడింది. ఈ షో నిర్వాహణపై ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ షో నిర్వహించ తలపెట్టిన 'టైమ్స్' ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అధినేత భవ్య మాట్లాడుతూ రెండున్నర కోట్లు వెచ్చించి ఈ ఈవెంట్‌ని ప్లాన్ చేసినట్లు తెలిపారు.
ఈ తరుణంలో బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ విషయంలో ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారనీ న్యాయస్థానం కూడా ప్రశ్నించిందనీ ఆమె అన్నారు. న్యూ ఇయర్ సీజన్‌లో కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్స్‌ని ఆర్గనైజ్ చేయడం, తద్వారా ఆదాయం కూడా అలాగే కోట్లలో ఆర్జించడం ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయమే. ఈ వేడుకలకు సెలబ్రిటీస్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలవడం కూడా కామనే.
సో ఆ రకంగా సెలబ్రిటీస్‌కి అది బుల్లితెరైనా, వెండితెరకైనా డిమాండ్ ఎక్కువఉంటుంది. కానీ బెంగుళూరులో జరుగాల్సిన ఈ న్యూ ఇయర్ ఈవెంట్ విషయంలో ఎందుకింత గందరగోళం జరుగుతోందో అర్ధం కావడం లేదు. ఈ వివాదం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.