ఇటీవల విడుదలైన క్రిష్ చిత్రం.. కొండపొలం. ఓనవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. ఈ సినిమా విమర్శకుల పరంగా ఓకే అనిపించుకుంది. కానీ వసూళ్లు రాలేదు. ఉప్పెన లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ తరవాత.. వచ్చిన సినిమా కావడంతో బయ్యర్లు మంచి రేటే పెట్టి కొన్నారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. కాకపోతే నిర్మాతలు సేఫ్. ఇప్పుడు ఓటీటీ రూపంలోనూ మంచి రేటే పలికిందని తెలుస్తోంది.
అమేజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని దాదాపు 3.5 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. రకుల్ కి మిగిలిన భాషల్లోనూ కాస్త క్రేజ్ ఉంది కాబట్టి.. ఓటీటీలో ఈ సినిమాని బాగానే చూడొచ్చు. శాటిలైట్ రైట్స్ రూపంలోనూ నిర్మాతకు మంచి రేటే వచ్చిందట. అలా... ఎలా చూసినా కొండపొలం నిర్మాతల పరంగా సేఫ్ జోన్ లోకి వెళ్లింది. ఈ దీపావళికి అమేజాన్ లో కొండపొలం స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి.