ఇటీవల యువ నిర్మాత మహేష్ కోనేరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి టాలీవుడ్ ని షాక్ కి గురి చేసింది. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను ఆయన అత్యంత సన్నిహితుడు. దాంతో ఎన్టీఆర్ సైతం ట్విట్టర్ లో తన సానుభూతి, సంతాపం తెలియజేశారు.
అయితే... మహేష్ కోనేరుకి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ అంతాచక్కర్లు కొడుతోంది. ఆయన మృతి చెందే నాటికి ఏకంగా 80 కోట్ల అప్పుందట. నిర్మాతలు, ఫైనాన్సియర్ల దగ్గర నుంచి 80 కోట్లు అప్పు చేశాడని, అప్పుల భారంతో.. మానసికంగా కృంగిపోయాడని, దాంతో హాట్ ఎటాక్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. మహేష్ కోనేరు నిర్మాతగా చేసిన సినిమాలు తక్కువే. అవన్నీ భారీ నష్టాలేం తెచ్చిన సినిమాలు కావు. బొటా బొటీగా గట్టెక్కేశాడు. అలాంటప్పుడు 80కోట్ల అప్పు ఎలా చేస్తాడు? అన్నదే ప్రశ్న. పైగా మహేష్ కోనేరు పేరుతో స్థిరాస్తులేం లేవట. కనీసం కారు, ఇల్లు కూడా మహేష్ పేరు మీద లేవని తెలుస్తోంది. కొన్ని అప్పులైతే లోపాయికారిగా జరిగిపోయాయి. వాటికి ప్రామిసరీ నోట్లు కూడా లేవట. అంటే... అప్పులిచ్చినవాళ్లంతా ఇప్పుడు నిండా మునిగిపోవాల్సిందే.