మెగా గడ్డం బ్యాచ్‌

మరిన్ని వార్తలు

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ని స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా, నిర్మాత రామ్‌చరణ్‌ తన ఇంట్లో మెగాస్టార్‌ సాక్షిగా కేక్‌ కట్‌ చేసి, సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ సెలబ్రేషన్‌లో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అయిన వ్యక్తి దర్శకుడు సురేందర్‌రెడ్డి. చరణ్‌తో 'ధృవ' చిత్రాన్ని రూపొందించిన సురేందర్‌రెడ్డి, ఆ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. కళ్యాణ్‌రామ్‌ హీరోగా రూపొందించిన 'అతనొక్కడే' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అందరి దృష్టిని ఆకర్షించాడు సురేందర్‌రెడ్డి. ఆ తర్వాత 'కిక్‌' వంటి సినిమాలతో కమర్షియల్‌ డైరెక్టర్‌గా సత్తా చాటాడు. అల్లు అర్జున్‌తో సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన 'రేసు గుర్రం' సూపర్‌ సక్సెస్‌ సాధించడమే కాకుండా, కలెక్షన్స్‌ పరంగా కూడా టాప్‌ రేంకింగ్‌లో నిలించింది. త్వరలో చిరంజీవితో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రాన్ని రూపొందించనున్నాడీ ఏస్‌ డైరెక్టర్‌. ఆగస్ట్‌లో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సెట్స్‌ మీదకు వెళ్ళనుంది. ఈ సినిమా కోసం చిరంజీవి తన గెటప్‌ని ఛేంజ్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గెడ్డంతో కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. అలాగే చరణ్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ కొత్త సినిమా కోసం చరణ్‌ కూడా గడ్డం పెంచుతున్నాడు. ఇలా ఓ పక్క చిరంజీవి, మరో పక్క చరణే కాకుండా సురేందర్‌ రెడ్డి కూడా గెడ్డంతో దర్శనమిస్తున్నాడు. ఈ ముగ్గురి కలయిక 'మెగా గడ్డం బ్యాచ్‌'గా ఇప్పుడు అందరి నోటా ప్రాచుర్యం పొందుతోంది. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS