ప్రముఖ రచయితగా పలు సక్సెస్‌ఫుల్ సినిమాలకు కథలందించిన దర్శకుడు కొరటాల శివ. దర్శకుడిగానూ భారీ బడ్జెట్ చిత్రాలతో, వరుస విజయాలు అందుకున్నాడు. దర్శకుడిగా తొలి సినిమా 'మిర్చి'తో భారీ విజయాన్ని అందుకున్న కొరటాల శివ, వరుసగా మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లతో సంచలన విజయాలు అందుకున్నాడు.
లేటెస్టుగా 'భరత్ అనే నేను' చిత్రంతో మరో రికార్డు హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. కొరటాల తన సినిమాలతో ఏదో ఒక బలమైన సందేశాన్ని సొసైటీకి కనెక్ట్ చేస్తాడు. అలాగే లేటెస్టుగా వచ్చిన 'భరత్ అనే నేను'తో కూడా మెసేజ్‌నే పాస్ చేశాడు. ఈ సారి కాస్త టైమ్ తీసుకుని మంచి కమర్షియల్ సినిమా తీసే యోచనలో కొరటాల ఉన్నాడట.
తెలుగు సినిమాల సంగతిటుంచితే, కొరటాలకు బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయట. 'జనతా గ్యారేజ్' టైంలోనే బాలీవుడ్ నుండి పిలుపొచ్చిందట. కానీ బాలీవుడ్‌కి వెళ్లడం కొరటాలకు ఇష్టం లేదట. తెలుగులోనే సినిమాలు చేస్తానని కొరటాల అంటున్నాడు. సొసైటీలో అడ్రస్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటిని తన సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేస్తానని అంటున్నాడు కొరటాల శివ. అయితే అందుకు ఇంకొంచెం టైం పడుతుందంటున్నాడు.
కొరటాల నుండి రాబోయే తర్వాతి చిత్రం మాత్రం పక్కా కమర్షియల్ చిత్రం కానుందని అయితే ఆయన క్లారిటీ ఇచ్చేశారు. హీరో ఎవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే కొరటాల లిస్టులో చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలు ఉన్నారు. చూడాలి మరి వీరిలో కొరటాల ఎవరిని సెలెక్ట్ చేస్తాడో.