మోహన్ బాబు కోసం ‘మహానటి’ వెయిటింగ్

మరిన్ని వార్తలు

మహానటి సావిత్రి జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన చిత్రం- మహానటి. ఇంకొక వారం రోజుల్లో ఈ చిత్రం విడుదలకానుంది.

ఈ తరుణంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నుండి ఒక సమస్య ఈ చిత్ర యూనిట్ ని వెంటాడుతుంది. అదేమనగా- ఈ చిత్రంలో అలనాటి మేటినటుడు SV రంగారావు పాత్ర పోషిస్తుండగా ఇప్పుడు ఆ పాత్రకి ఆయన డబ్బింగ్ చెప్పడం పెండింగ్ ఉండిపోయిందట. దీనికి కారణం ఆయన తన భుజానికి శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్ళడంతో ఈ డబ్బింగ్ వాయిదా పడిందట.

ఇక విడుదలకి ఈ చిత్రం మరొక వారమే ఉండగా ఈ చిత్ర యూనిట్ మొత్తం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కోసం వెయిటింగ్ లో ఉన్నారట. స్వతహాగా మోహన్ బాబు డైలాగ్స్ కి పెట్టింది పేరు అదే సమయంలో ఆయన  పోషించిన పాత్ర SV రంగారావు పాత్ర కూడా డైలాగ్స్ చాలా భారీగా ఉంటుంది.

మరి అనుకున్న సమయంలో ఈ డబ్బింగ్ పూర్తి చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS