‘ఆచార్య’పై తీపి కబురు చెప్పిన కొరటాల!

మరిన్ని వార్తలు

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’పై లేటెస్ట్‌ అప్‌డేట్‌ బయటికి వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ, కొన్ని కారణాలతో సమ్మర్‌కి పోస్ట్‌ పోన్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ కారణాల్లో ముఖ్యమైనది ఈ సినిమాలో కీలక పాత్ర కోసం చరణ్‌ని తీసుకోవడమే. ప్రస్తుతం చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో బిజీగా ఉన్న కారణంగా ఆ పాత్రలో కనిపించే ఆ ఇంపార్టెంట్‌ పర్సన్‌ కోసం వేట కొనసాగుతోంది. మరోవైపు ఆ పాత్రలో మహేష్‌బాబు నటిస్తాడనే ప్రచారం జరిగింది.

 

కానీ, అదంతా ఉత్తదే అని తేలిపోయింది. ఇదిలా ఉంటే, ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్‌ కంప్లీట్‌ అయిపోయిందని తాజాగా దర్శకుడు కొరటా శివ తెలపడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఇదే ఆ లేటెస్ట్ అప్డేట్.. 40 శాతం షూటింగ్‌ కంప్లీట్‌ అయిపోయిందంటే, ఇక ఆ మిగిలిన పార్ట్‌ పూర్తి చేయడం పెద్ద విషయం కాదు. కరోనా లాక్‌డౌన్‌ లేకుంటే, ఈ పాటికే మరో షెడ్యూల్‌ కూడా పూర్తయ్యి ఉండేది. ఇకపోతే లాక్‌డౌన్‌ ఎత్తేసిన వెంటనే ‘ఆచార్య’ సెట్స్‌ మీదికెళ్లనుందంటున్నారు. ఆల్రెడీ ఆ ఏర్పాట్లలో కొరటాల అండ్‌ టీమ్‌ గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేస్తున్నారట. ఇంకేముంది.. ఈ వార్త మెగా అభిమానులకు తీపి కబురే కదా. ఆ క్షణం కోసమే ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. నిరంజన్‌ రెడ్డితో కలిసి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చందమామ కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS