కొరటాల శివ ప్రతి సినిమాలో ఎదో ఒక మెసేజ్ వుంటుంది. మిర్చిలో ఫ్యాక్షనిజం వద్దని చెప్పారు. శ్రీమంతుడులో గ్రామాన్ని దత్తత తీసుకోవడం, జనతా గ్యారేజ్ లో ప్రకృతి ప్రేమ, భరత్ అనే నేను లో రాజకీయ జవాబుదారితనం ఇలా ఆయన సినిమాలన్నీ ఎదో ఒక మెసేజ్ చుట్టూ తిరిగాయి. ఆచార్యలో కూడా 'ధర్మం'' చుట్టూ ఏదో చెప్పే ప్రయత్నం చేశారు కానీ అది సరిగ్గా కనెక్ట్ కాలేదు. అయితే ఇప్పుడు తన సినిమా కోసం పూర్తిగా రూటు మార్చేస్తున్నారు కొరటాల.
ఆచార్య తర్వాత ఎన్టీఆర్ తో జత కడుతున్నారు కొరటాల. ఈ సినిమా స్క్రిప్ట్ అప్పుడే లాక్ అయ్యింది. ఐతే ఈ కథలో ఎలాంటి సందేశాలు వుండవు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా వుండబోతుంది. ఇక సందేశాలు వద్దని కొరటాల బలంగా నిర్ణయించుకున్నారట. ఎన్టీఆర్ కూడా సందేశం అవసరం లేదు కథ ఆసక్తిగా వుంటే చాలని భావిస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ కమర్షియల్ ప్యాకేజీగా ఈ సినిమా ఉండబోతుందని తెలిసింది. ముఖ్యంగా అభిమానులని అలరించే సినిమాగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారు.