వెంకటేష్ కి 15 కోట్లు

By iQlikMovies - May 18, 2022 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లోనే హయ్యస్ట్ రేమ్యునిరేష్ తీసుకున్నారు. ఎఫ్ 3కోసం దాదాపు 15కోట్లు రేమ్యునిరేషన్ అందుకున్నారట వెంకీ. ఈ స్థాయిలో రేమ్యునిరేషన్ అందుకోవడం వెంకీకి ఇదే తొలిసారి. ఎఫ్ 2 కోసం నాలుగు కోట్లు తీసుకున్నారు వెంకటేష్. ఐతే ఈ సినిమా ఎవరూ ఊహించనంత విజయం సాధించింది. రూపాయికి పది రూపాయిలు వెనక్కి తీసుకొచ్చింది ఎఫ్ 2.

 

తన సినిమాల్లో ఎఫ్ 2నే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిందని స్వయంగా నిర్మాత దిల్ రాజే చెప్పారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిర్మాణ వ్యయం కూడా బాగా పెరిగింది. ఎఫ్ 3కి వున్న క్రేజ్ దృష్ట్యా 15కోట్లు అడిగారట వెంకీ. ఎఫ్ 4 కూడా తీసే ఆలోచనలో వున్న దిల్ రాజు.. వెంకీ అడిగినంత ఇచ్చారని తెలిసింది. అలాగే వరుణ్ తేజ్ కూడా దాదాపు 8కోట్లు తీసుకున్నారట. ఇది కూడా వరుణ్ కి కెరీర్ హయ్యెస్ట్ రెమ్యునిరేషన్. మొత్తానికి ఎఫ్ 2 విజయం..దాని క్రేజు ఇద్దరి హీరోల పంట పడించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS