Kota Srinivasa Rao: ఫేక్ వార్త‌ల‌పై కోట సీరియ‌స్‌

మరిన్ని వార్తలు

మ‌నిషి ఉండ‌గానే...పాడి క‌ట్టేస్తోంది సోష‌ల్ మీడియా. సినిమా సెల‌బ్రెటీల విష‌యంలో మ‌రీనూ. చాలామంది నటీన‌టుల‌కు ఈ చేదు అనుభ‌వం ఎదురైంది. వాళ్లు బ‌తికి ఉండ‌గానే... చ‌నిపోయారంటూ ఫేక్ వార్త‌లు సృష్టిస్తోంది. ఇప్పుడు కోట శ్రీ‌నివాస‌రావుదీ అదే ప‌రిస్థితి. ఈ సీరియ‌ర్ న‌టుడు చ‌నిపోయాడంటూ.. పొద్దున్నుంచి సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. జ‌నాలు కూడా ఇదే నిజం అనుకొన్నారు. రిప్‌ల‌తో సంతాపాలు వ్య‌క్తం చేశారు. నిజానికి కోట శ్రీ‌నివాస‌రావు ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయ‌న‌కు ఏం కాలేదు. చివ‌రికి కోట‌నే స్వ‌యంగా `నేను బ‌తికే ఉన్నా` అని ప్ర‌క‌టించుకోవాల్సివ‌చ్చింది.

 

కోట మ‌ర‌ణ వార్త‌లు ఉధృతం అవుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఓ వీడియో సందేశం విడుద‌ల చేశారు. తాను క్షేమంగానే ఉన్నాన‌ని, ద‌యచేసి పుకార్ల‌ని న‌మ్మొద్ద‌నికోరారు. అంతేకాదు.. మ‌నిషి బ‌తికి ఉండ‌గానే చంపేయ‌కండ‌ని, ప్రాణాల‌తో ఆటలొద్ద‌ని హిత‌వు ప‌లికారు. డ‌బ్బులు సంపాదించ‌డానికి చాలా మార్గాలున్నాయ‌ని, ఓ మ‌నిషి ప్రాణాల‌తో చెల‌గాటం ఆడొద్ద‌ని హెచ్చ‌రించారు. ఇప్పుడు కోట శ్రీ‌నివాస‌రావు వీడియో సైతం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. మొత్తానికి కోట క్షేమంగానే ఉన్నారు. ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉంది. ఈ విష‌యంలో ఆయ‌న అభిమానులు కాస్త కంగారు ప‌డ్డా, ఇప్పుడు కుదుట ప‌డ్డారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS