క్రాక్‌లో కిర్రాకెక్కించే ఐటెమ్ సాంగ్.

By iQlikMovies - October 16, 2020 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

'డాన్‌శీను` `బలుపు`.... రవితేజ - గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందిచ‌న ఈ రెండు చిత్రాలూ మాస్ ని మెప్పించాయి. ఇప్పుడు ఈ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రూపొందుతోంది. అదే... 'క్రాక్‌`. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌. హైదరాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ జరుగుతోంది. ప్రస్తుతం ఓ ఐటెమ్ గీతాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ పాట‌లో రవితేజతో పాటు అప్సరా రాణి చిందులేస్తోంది. జానీ మాస్టర్ నృత్య రీతులు స‌మ‌కూరుస్తున్నారు.

 

ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణను పూర్త‌వుతుంది. ఆ వెంట‌నే.. రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టిస్తారు. సంక్రాంతికి ఈ సినిమాని విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌. కానీ సంక్రాంతికి కొత్త సినిమాల తాకిడి ఎక్కువ‌గా ఉంది. థియేట‌ర్లకు అనుమ‌తులు ఇచ్చి, ప్రేక్ష‌కులు సినిమాల్ని చూడ్డానికి అల‌వాటు ప‌డితే, డిసెంబ‌రులోగానే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. దీనిపై త్వ‌ర‌లో క్లారిటీ వ‌స్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS