తమిళనాట ప్రేమపక్షుల కథలు, పెళ్లి ముచ్చట్లు... ఎప్పుడూ హాట్ టాపిక్కే. అక్కడ గాసిప్ వీరులకు... హీరో, హీరోయిన్ల మధ్య లింకులు పెట్టడమంటే మహా సరదా. దానికి తగ్గట్టే.. అక్కడ వ్యవహారాలు నడుస్తుంటాయి. త్రిష - శింబుల ప్రేమ గురించి పెళ్లి గురించి చాలా కాలం గా వార్తలొస్తున్నాయి. ఈమధ్య అవి మరింత ఊపందుకున్నాయి. డిసెంబరులోనే వీళ్ల పెళ్లి జరగబోతోందంటూ... ఓ హాట్ వార్త తమిళ నాటంతా రచ్చ రచ్చ చేస్తోందిప్పుడు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన `విన్నైతాండి పరువాయ`లో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ సినిమాలో వీళ్ల కెమిస్ట్రీ బాగా పండింది. అప్పటి నుంచీ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని వార్తలొచ్చాయి.
మధ్యలో కాస్త బ్రేక్ పడింది. అప్పట్లో త్రిషకు వేరొకరితో నిశ్చితార్థం అవ్వడం, పెళ్లి ఖాయం అవ్వడంతో... శింబు టాపిక్కు ఆగింది. అయితే త్రిష పెళ్లి బ్రేకప్ అయ్యింది. దాంతో ఇప్పుడు మళ్లీ... ఈ ప్రేమపక్షులపై మీడియా దృష్టి పెట్టింది. `ఈ డిసెంబరులో ఓ శుభవార్త` చెబుతా అంటూ శింబు తన అభిమానులకు ఓ వార్త చేరవేశాడు. అప్పటి నుంచీ.. `డిసెంబరులో త్రిష - శింబుల పెళ్లి` అనే వార్త మరింత విస్కృతంగా చక్కర్లు కొడుతోంది. శింబు పెళ్లి ఖాయమైందన్న వార్త మాత్రం నిజమే అని, అది త్రిషతోనా, కాదా అనేది సస్పెన్స్ అని తమిళ మీడియా చెబుతోంది.