కృష్ణవంశీకి చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం. తనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. చిరు 150వ సినిమా చర్చలకు వచ్చినప్పుడు కృష్ణవంశీ పేరు గట్టిగా వినిపించింది. `వందేమాతరం` పేరుతో ఓ స్క్రిప్టు రాసుకొన్నాడు వంశీ. అయితే... అది ఇంత వరకూ పట్టాలెక్కలేదు. కానీ చిరంజీవితో ఎప్పటికైనా సినిమా చేస్తా అంటున్నాడు కృష్ఱవంశీ.
''అన్నయ్యతో సినిమా అంటే అది `మాయాబజార్` స్థాయిలో ఉండాలి. అలాంటి కథతో సినిమా చేయాలి. యాక్షన్, ఫ్యాక్షన్, లవ్ స్టోరీ, సోషియో ఫాటంసీ.. ఇలా మనకు చాలా జోనర్లు ఉన్నాయి. అలానే చిరంజీవి సినిమా అనేది కూడా ఓ ప్రత్యేకమైన జోనర్. అందులో అన్ని రకాల అంశాలూ ఉండాలి. అలాంటి కథ వచ్చినప్పుడు తప్పకుండా అన్నయ్యని కలుస్ఆత. ఒప్పిస్తా. అన్నయ్య అందుబాటులో ఉన్నాడు కదా అని ఏ కథ పడితే ఆ కథ చెప్పను'' అన్నాడు కృష్ణవంశీ. ఆయన దర్శకత్వం వహించిన 'రంగమార్తండ' విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం కోసం చిరంజీవి ఓ షాహరీ కూడా ఆలపించారు. కృష్ణవంశీ, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.