రోజాపై తీవ్రంగా విరుచుకుపడ్డ నాగబాబు

మరిన్ని వార్తలు

మంత్రి రోజాపై, మెగా బ్రదర్ నాగబాబు విరుచుకుపడ్డారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదు.. అభివృద్ధి చేయడం అని మంత్రి తెలుసుకోవాలన్నారు. ఇక చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లపై రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘రోజా.. మీరు ఇన్ని రోజులు నోటికొచ్చినట్లు మాట్లాడినా స్పందించకపోవడానికి ఒకటే కారణం. మీ నోటికి.. మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు..’’ అని నాగబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

ఇటివల రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పులు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మూతికి ప్లాస్టర్ వేసుకుంటాడని.. ఆయన తప్పులు చేసి ఇరుక్కున్న సమయంలో ఆయనకు మద్దతుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటాడని, దీన్ని బట్టి ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతోందని విమర్శించారు. దీనిపై రోజాకు కౌంటర్ ఇచ్చారు నాగబాబు.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS