సరైన పాత్ర దొరికినప్పుడే నటీనటుల్లోని అసలైన ప్రతిభ బయటకు వస్తుంది. సవాళ్లు ఎదురైన కొద్దీ వాళ్లు రాటుదేలుతుంటారు. ఈమధ్య సమంత.. అలాంటి సవాళ్లని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటోంది. `రంగస్థలం`, `ఓ బేబీ`, `యూటర్న్` చిత్రాల్లో సమంత తన ఇమేజ్ కి భిన్నమైన పాత్రల్ని పోషిస్తోంది. `ది ఫ్యామిలీమేన్ 2`లోనూ తన పాత్ర కొత్త తరహాదే. ఈ పాత్ర కోసం సమంత చాలా కసరత్తు చేసింది. రాజీ అనే పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడింది.
ఈ పాత్ర కోసం మూడు రోజుల పాటు... తన గదిలోంచి బయటకు రాలేదట సమంత. ఈలోగా.. చాలా డాక్యుమెంటరీలను చూసిందట. రాజీ పాత్రకు తగ్గట్టుగా తన కాస్ట్యూమ్స్, మేకప్, బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ తానే డిజైన్ చేసుకుందట. అందుకే ఈ పాత్రపై తనకు చాలా ప్రేమ. ఫైనల్ అవుట్ పుట్ చూశాక.... కన్నీళ్లు పెట్టుకుందట సమంత. ఈ విషయాలన్నీ తానే చెప్పింది.
అయితే... ఈ వెబ్ సిరీస్ బయటకు రాకుండానే.. తమిళులు గొడవ చేస్తు్నారు. తమ రాష్ట్రంలో ఈ వెబ్ సిరీస్‌ని బ్యాన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అదొక్కటే సమంతని బాధించే విషయం. మరి ఈ వ్యవహారంలో తమిళుల మనసుల్ని సమంత ఎలా గెలుచుకుంటుందో చూడాలి.