చిక్కుల్లో క్రిష్‌ 'మణి కర్ణిక'

మరిన్ని వార్తలు

క్రిష్‌ దర్శకత్వంలో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో 'మణి కర్ణిక' అనే సినిమా తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించారు క్రిష్‌. ఈ సినిమా విడుదల డేట్‌ని కూడా అనౌన్స్‌మెంట్‌ రోజే క్రిష్‌ తెలియజేశారు. అయితే ఇప్పుడు 'మణికర్ణిక' సినిమా చిక్కుల్లో పడింది. ఇందుకు కారణం లీడ్‌ రోల్‌ పోషిస్తోన్న కంగనా. గతంలో కంగనా ఇదే కాన్సెప్ట్‌లో నటించేందుకు ఓ డైరెక్టర్‌కి ఓకే చెప్పింది. 'రాణి ఆఫ్‌ ఝాన్సీ - ది వారియర్‌ క్వీన్‌' పేరుతో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్‌కి డైరెక్టర్‌ కేతన్‌ మెహతాకి ఓకే చెప్పిన కంగనా ఆ తర్వాత హ్యాండిచ్చింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న 'మణికర్ణిక'కు సై అంటోంది. అంతేకాదు ఈ సినిమా నిర్మాణంలో కూడా కంగనా భాగస్వామిగా ఉండడంతో, కేతన్‌ మెహతాకి ఈ విషయం తెలిసి చిత్ర యూనిట్‌పై గుర్రుమంటున్నాడు. కంగనా మీద కోపం చిత్ర యూనిట్‌పై చూపిస్తున్నాడు కేతన్‌. అవును నిజమే, కేతన్‌ ఎంతో కష్టపడి ఈ సినిమాకి స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. అప్పుడు తాను రెడీ చేసుకున్న స్క్రిప్టునే ఇప్పుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న సినిమాలోనూ ఉండడంతో ఆయన గుర్రుమనడం తప్పేం కాదు. ఈ రెండు సినిమాల కాన్సెప్ట్‌ వీరనారి ఝాన్నీ లక్ష్మీభాయ్‌ జీవిత చరిత్రే. ఏది ఏమైనా కానీ ఈ వివాదంతో మన టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌కే అసలు చిక్కు వచ్చి పడింది. ఈ వివాదాల కారణంగా ఇప్పుడు ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో క్రిష్‌ ఉన్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS