రీ ఎంట్రీలో చక చక సినిమాలు చేసి, ఫ్యాన్స్‌కి కిక్ ఇవ్వాలనుకున్నాడు పవన్ కల్యాణ్. కానీ... లాక్ డౌన్ వల్ల తన ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది. పవన్ సినిమాలు రెండూ ఆగిపోయాయి. లాక్ డౌన్ తరవాత షూటింగులు మొదలైనా, ముందు `వకీల్ సాబ్` పూర్తి చేయాలి. ఆ తరవాతే క్రిష్ సినిమా. వాస్తవానికి క్రిష్ సినిమా కొంత మేర విదేశాల్లో తీయాలని భావించారు. నార్త్‌లో పెద్ద పెద్ద కోటలున్న ప్రదేశాలు చూసి, అక్కడ షూటింగ్ చేద్దామనుకున్నారు. ఎందుకంటే ఇది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. మొగలాయిల కాలం నాటి ఎపిసోడ్లు.. పెద్ద పెద్ద కోటల్లోనే తీయాలి. అందుకోసం కొన్ని లొకేషన్లు సెట్ చేశారు కూడా.
కాకపోతే లాక్ డౌన్ తరవాత షూటింగులకు అనుమతి ఇచ్చినా, రాష్ట్రాలు, దేశాలూ దాటి పోవడానికి వీల్లేదు.అందుకే.. ఇప్పుడు అందుకు సంబంధించిన సన్నివేశాలన్నీ రామోజీ ఫిల్మ్‌సిటీలోనే పూర్తి చేయాలని క్రిష్ భావిస్తున్నాడట. వీలైనంత వరకూ అవుడ్డోర్ షూటింగులు లేకుండా, ఇండోర్ లోనే సన్నివేశాలన్నీ తెరకెక్కించాలని క్రిష్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. దాంతో సమయమే కాదు, బడ్జెట్ కూడా కలిసొస్తుందని చిత్రబృందం భావిస్తోంది. ఇండోర్ లో అయితే.. తక్కువ మంది బృందంతో షూటింగ్ చేసుకోవొచ్చు. అటు వకీల్ సాబ్, ఇటు క్రిష్ సినిమా రెండింటి షూటింగ్ సమాంతరంగా చేసుకోవొచ్చు. అందుకే క్రిష్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. పవన్ కూడా అందుకు ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది.