ఈ సంక్రాంతికి ఒక పక్క మెగాస్టార్ సినిమా 'ఖైదీ నెంబర్ 150', మరో పక్క బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలకు సంబంధించిన అభిమానుల మధ్య అనేక వివాదాలు తలెత్తుతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ వివాదాలకు తెర లేపేందుకు క్రిష్ ఒక చిన్న ప్రయత్నం చేశాడు. ఈ పండక్కి ఇద్దరు పెద్ద హీరోలను మనస్పూర్తిగా ఆహ్వానిద్దాం అంటూ స్వీట్‌గా ట్వీట్ చేశాడు. దాంతో ఈ వివాదాలకు కొంత తెర పడినట్టే అని చెప్పుకోవచ్చు. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాకి డైరెక్టరే క్రిష్. ఈ హెల్దీ ట్వీట్ చేసినందుకు అంతా హ్యాపీ ఫీలవుతున్నారు. కానీ మరో పక్క వివాదాలు ఆగే తీరు కనిపించడం లేదు. ఈ రెండు సినిమాలు ప్రతిష్ఠాత్మకమైనవే. బాలయ్యకు 'శాతకర్ణి' 100వ చిత్రం కాగా, చిరంజీవికి ఇంకా స్పెషల్. 150వ చిత్రం ఒక పక్క, చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోన్న సినిమా 'ఖైదీ'. ఇలా ఈ రెండు సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. సో పోటీ ఉండడం సహజమే. కానీ ఆ పోటీ ఆరోగ్యకరమైనది అయితే బావుంటుంది. రెండు సినిమాలు రెండు డిఫరెంట్ కాన్సెప్ట్‌కి సంబంధించినవి. సో రెండు సినిమాలు ప్రేక్షకాదరణ పొందాలి. అప్పుడే సంక్రాంతి అసలైన పండగ అవుతుంది. ఇలా జరగాలంటే ఈ విషయాన్ని అభిమానులు ముందుగా గ్రహించాలి. అప్పుడే ప్రేక్షకులు వినోదాత్మకంగా మంచి అనుభూతిని పొందుతారు. సినిమా పరంగా మన తెలుగు ఇండస్ట్రీ కూడా అభివృద్ది చెందుతుంది. ఏమంటారు ఒప్పుకుంటారా!