పాపం... క్రిష్ పరిస్థితేం బాలేదు. కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు రెండూ ఫ్లాపయ్యాయి. కొండపొలెం డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకొన్న హరి హర వీరమల్లు షూటింగ్ నత్త నడకలా సాగుతోంది. పవన్ కాల్షీట్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సినిమా షూటింగ్ కి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఇటీవలే.. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ మొదలైంది. పవన్ పై యాక్షన్ పార్ట్ తీద్దామనుకొన్నారు. కానీ.. ఈ షూటింగ్ కి మరోసారి పవన్ డుమ్మా కొట్టేశాడు. దాంతో.. గతిలేక.... ఓ డూప్ తో యాక్షన్ సీన్స్ లాగించేస్తున్నారని సమాచారం.
లాంగ్ షాట్స్ అన్నీ.. పవన్ డూప్ తో చేసి, పవన్ వచ్చాక.. క్లోజప్ షాట్లు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు పవన్ డూప్ తో షూటింగ్ లాగించేస్తున్నారని తెలుస్తోంది. డూప్స్ తో షూటింగ్ చేయడం మామూలు విషయమే. కానీ.. డూప్ ని నమ్ముకొని షూటింగ్ చేయడం మాత్రం ఇప్పుడు విచిత్రంగా తోస్తోంది. సైరా, రాధేశ్యామ్ సినిమాల విషయంలోనూ ఇలానే జరిగింది. హీరోతో పోలిస్తే... డూప్స్ తోనే ఎక్కువ షాట్లు తీశారు. ఇప్పుడు హరి హర వీరమల్లు పరిస్థితి కూడా ఇలానే తయారైంది.