ఈనాటి రచయితలపై, దర్శకులపై త్రివిక్రమ్ ప్రభావం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాటల్లో, టేకింగ్‌లో, క్యారెక్టరైజేషన్‌లో త్రివిక్రమ్ సినిమాల్ని తుచ తప్పకుండా పాటించే వాళ్లు చాలామందే కనిపిస్తుంటారు. అయితే.. వాళ్లంతా త్రివిక్రమ్‌ని కాపీ కొట్టినట్టే అనిపిస్తుంది తప్ప...త్రివిక్రమ్‌లాంటి మార్క్ కనిపించదు. మరీ ముఖ్యంగా ప్రాసల విషయంలో - దొరికిపోతుంటారు. అయితే... ఇప్పుడు చిత్రసీమకు మరో జూనియర్ త్రివిక్రమ్ వచ్చాడు. కృష్ణ చైతన్యరూపంలో.
గీత రచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించిన కృష్ణ చైతన్య `రౌడీ ఫెలో`తో దర్శకుడిగా మారాడు. ఇప్పుడు నితిన్ 25వ సినిమా 'ఛల్ మోహన్ రంగ'కీ అతనే దర్శకుడు. ఈ సినిమాలో మాటలకు మంచి స్పందన వస్తోంది. చాలా వరకూ `త్రివిక్రమ్ లా` అనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందించిన సంగతి తెలిసిందే. ఈ కథని త్రివిక్రమ్ సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో.. సినిమా అలా ఉంది. చాలా వరకు సంభాషణలు త్రివిక్రమ్ శైలిని గుర్తు చేశాయి. అవన్నీ పండాయి కూడా. త్రివిక్రమ్ తరహా టేకింగు, క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో్ కనిపించాయి.
త్రివిక్రమ్‌కి శిష్యుడు కాకపోయినా.. ఓ విధంగా భక్తుడు కృష్ణ చైతన్య. ఓ విధంగా.. త్రివిక్రమ్ కృష్ణ చైతన్యలో పూని రాస్తే ఎలా ఉంటుందో.. ఈ సినిమాలో డైలాగులు అలా ఉన్నాయి.య మొత్తానికి డైలాగుల పరంగా ఫుల్‌గా మార్కులు కొట్టేశాడీ యువ దర్శకుడు. అభిమానులంతా ఇక మీదట ఆయన్ని జూ.త్రివిక్రమ్ అని పిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు.