కృష్ణ - విజయ నిర్మల వీరిద్దరూ భార్యాభర్తలని చాలామందికి తెలుసు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... కృష్ణ - విజయ నిర్మలకు ఇది వరకే విడి విడిగా పెళ్లిళ్లయిపోయాయి. కృష్ణని పెళ్లి చేసుకొనేటప్పటికి విజయ నిర్మమలకు నరేష్ పుట్టాడు. కృష్ణకు ఇందిరా దేవితో పెళ్లయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇది వారిద్దరికీ రెండోపెళ్లి. పైగా రహస్యంగా వివాహం చేసుకొన్నారు. తిరుపతిలో ఇద్దరు ముగ్గురు సన్నిహితుల మధ్య కృష్ణ - విజయ నిర్మల పెళ్లి జరిగింది.
అయితే ఈ పెళ్లి విషయం... కృష్ణ తన భార్య ఇందిరతో చెప్పేశారు. అయినా.. ఇందిర పెద్ద మనసు చేసుకొని... శాంతంగా ఉండిపోయారు. ఎలాంటి గొవడ చేయలేదు. విజయ నిర్మలని పెళ్లి చేసుకొన్నా - ఇందిరకు విడాకులు ఇవ్వలేదు. అయితే ఇందిర మాత్రం ఓ కండీషన్ పెట్టార్ట. `మీరు పెళ్లి చేసుకోవడం మీ ఇష్టం.కానీ.. విజయ నిర్మలతో మాత్రం పిల్లల్ని కనకూడదు. ఎందుకంటే మనకు ముగ్గురు పిల్లలున్నారు. వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించండి` అంటూ ఇందరి కండీషన్ పెట్టార్ట. అందుకే.. విజయ నిర్మలతో కృష్ణ పిల్లల్ని కనలేదు.
అయితే.. విజయ నిర్మలతో పెళ్లయ్యాక కూడా... ఇందిరతో కలిసి ఇద్దరు బిడ్డలకు జన్మ ఇచ్చారు కృష్ణ. వాళ్లే... మహేష్, మంజుల. కృష్ణతో తనకు పిల్లలకు లేకపోయినా.. ఏ రోజూ విజయ నిర్మల కృష్ణని ఇబ్బంది పెట్టలేదు. ఇంట్లో ఇచ్చిన మాటకు ఆమె కూడా కట్టుబడి ఉండిపోయారు.