Krishna, Jayaprada: కృష్ణతో జ‌య‌ప్ర‌ద‌.. ఈ రికార్డ్ బ‌ద్ద‌లు కొట్ట‌గ‌ల‌రా?

మరిన్ని వార్తలు

ఓ హీరో హీరోయిన్ క‌లిసి నాలుగైదు సినిమాలు చేస్తేనే అదో విచిత్రంలా చూసే రోజుల్లో ఉన్నాం. అలాంటిది ఓ హీరో, హీరోయిన్ క‌లిసి ఏకంగా 45 చిత్రాల్లో న‌టించారంటే న‌మ్ముతారా..? అదో రికార్డ్‌గా గుర్తించాల్సిందే.

 

ఈ ఘ‌న‌త సాధించిన జంట కృష్ణ - జ‌య‌ప్ర‌ద‌. వీరిద్ద‌రూ క‌లిసి ఏకంగా 45 సినిమాల్లో జోడీగా క‌నిపించారు. అందులో దాదాపు స‌గం సూప‌ర్ హిట్లున్నాయి. శ్రీ రాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌ చిత్రంలో కృష్ణ సరసన తొలిసారిగా నటించారు జయప్రద. ‘మనవూరి కథ`, ‘ఈనాటి బంధం ఏ నాటిదో’ ,‘దొంగలకు దొంగ’ ఇలా వ‌రుస సినిమాల‌తో హోరెత్తించారు. కృష్ణ, జయప్రద కాంబినేషన్‌లో వచ్చిన ‘ఊరికి మొనగాడు’ చిత్రం పెద్ద హిట్. `ఇదిగో తెల్ల చీర.. ఇవిగో మల్లెపూలు’ పాట కోసమే మళ్లీ మళ్లీ సినిమా చూసిన అభిమానులున్నారు. కృష్ణ - విజ‌య నిర్మ‌ల‌, కృష్ణ - శ్రీ‌దేవిల జంట కూడా సూప‌ర్ హిట్టే. కాక‌పోతే... వీరిద్ద‌రితో పోలిస్తే జ‌య‌ప్ర‌ద‌తోనే కృష్ణ‌కు ఎక్కువ హిట్లున్నాయి. జ‌య‌ప్ర‌ద కెరీర్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా సాగిపోవ‌డానికి ఆ రోజుల్లో కృష్ణ సినిమాలే కార‌ణం. ఇన్ని సినిమాల్లో జంట‌గా న‌టించిన వీరిద్ద‌రూ ఒక‌ట్రెండు సినిమాల్లో అన్నాచెల్లెళ్లుగానూ క‌నిపించ‌డం విశేషం. ఎలా చూసినా.. ఈ జంట సృష్టించిన రికార్డుని మాత్రం ఎవ్వ‌రూ బ‌ద్ద‌లు కొట్ట‌లేరు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS