ఇదేందయ్యా ఇది.. ఇదేంది?

మరిన్ని వార్తలు

మన టాలీవుడ్ ను 20 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కితే అది బాలీవుడ్ అని కొంతమంది 'మన్మధుడు' డైలాగ్ ను మార్చి చెప్తుంటారు. చాలాసార్లు అదే నిజమనిపిస్తుంది. కానీ మన జనాలు కూడా ఏమీ తక్కువ తినలేదని అప్పుడప్పుడూ నిరూపిస్తూ ఉంటారు. లేటెస్టుగా 'కృష్ణ అండ్ హిస్ లీల' దర్శకుడు, హీరో అదే నిరూపించారు.

 

మన టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆన్ స్క్రీన్ కిస్సులు కామనే కానీ ఆఫ్ స్క్రీన్ కిస్సులు అలవాటు లేదు. అందులోనూ మగ - మగ కిస్సు అంటే బెంబేలెత్తిపోతారు. ఏదో ప్రేమ కొద్ది బుగ్గ మీద పెడితే సరే కానీ ఏకంగా లిప్ కిస్ పెడితే మాత్రం కష్టమే. కృష్ణ అండ్ హిస్ లీల తాజాగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది. మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. మరి దీంతో ఫుల్ గా ఎగ్జైట్ అయ్యారో ఏమో కానీ దర్శకుడు రవికాంత్ పెరేపు, హీరో సిద్దు జొన్నలగడ్డ ఇద్దరూ మూతి ముద్దు ఇచ్చుకున్నారు. అసలే మన సభ్య సమాజానికి ఇవి అర్థం కాని కాన్సెప్టు. పైగా ఎక్కడో బాలీవుడ్ లో సరే కానీ టాలీవుడ్ లో ఇలా జరగగానే అందరూ ముక్కున వేలేసుకున్నారు.

 

ఎంత ఉత్సాహం కట్టలు తెంచుకున్నా హగ్గు చేసుకుంటారు లేకపోతే బుగ్గ మీద ముద్దులు పెట్టుకుంటారు. అంతే కానీ ఈ మూతి ముద్దులేంటి? ఇవి కనుక యూతు ఫాలో అయితే తెలుగు సమాజం ఆగమాగం కావడం ఖాయం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS