ఈ మధ్య ఓటీటీ డైరెక్ట్ రిలీజులు ఊపందుకుంటున్నాయి. అన్ని భాషలలో దర్శక నిర్మాతలు నెమ్మదిగా ఓటీటీ వేదికల ద్వారా తమ సినిమాలు విడుదల చేస్తున్నారు. థియేటర్లు మరో రెండు మూడు నెలల పాటు తెరిచే అవకాశం లేకపోవడం, ఒకవేళ తెరిచినా మునుపటిలాగా ప్రేక్షకులు వస్తారో రారో అనే అనుమానాలు ఉండడంతో చాలామంది ఫిలింమేకర్లు ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య ఇలా రిలీజ్ అయిన సినిమాలలో ఒక్క సినిమాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు.
అయితే 'కృష్ణ అండ్ హిజ్ లీల' కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. 'క్షణం' ఫేమ్ రవికాంత్ పెరేపు దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాథ్, షాలిని వడ్నికట్టి, సీరత్ కపూర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా జూన్ 25 న నెట్ ఫ్లిక్స్ లో విడుదలయింది. ఈ సినిమాను తాజాగా మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో కూడా రిలీజ్ చేస్తున్నామని ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు వెల్లడించారు. జులై 4 నుంచి ఈ సినిమా ఆహలో కూడా స్ట్రీమింగ్ అవుతుందని ఆయన తెలిపారు.
రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సినిమాను విడుదల చేయడానికి కారణం ఏంటి అని అడిగితే, ఇది ముందే తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తే ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు రీచ్ అవుతుందని, అదే ఆహా లో లోకల్ ఆడియన్స్ కు ఎక్కువగా రీచ్ అవుతుందనే ఉద్దేశంలో ఇలా చేస్తున్నామని తెలిపారు. అయితే అన్ని సినిమాలకు ఇలా చేయడం వీలుకాదన్నారు